Minister Nimmala Ramanaidu About Budameru Leakage Works :బుడమేరు మూడో గండి పుడ్చివేత 90 శాతం పూర్తి అయ్యిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇంకో రెండు మూడు గంటల్లో చంద్రబాబు కృషి ఫలించి బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తి అవుతాయన్నారు. మిగిలిన 10శాతం ఇంకో రెండు గంటల్లో పూర్తి చేసి దిగువ ప్రాంతాలకు వెళ్లే వరద నీటిని అరికడతామని మంత్రి తెలిపారు. ఇవాళ్టి తో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని మంత్రి తేల్చిచెప్పారు. విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే తమకష్టం చాలా తక్కవ అని ఆయన అన్నారు.
బుడమేరుకు భారీగా గండ్లు పడటంతో విజయవాడలోని పలు కాలనీలకు వరద పోటెత్తింది. యుద్ధప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోంది. సైన్యం కూడా రంగంలోకి దిగింది. గండ్ల వద్ద సమస్య పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. బుడమేరు గండ్లను గేబియాన్ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపుతారు) ద్వారా పూడ్చాలని నిర్ణయించినట్లు సైన్యం వెల్లడించింది.