Minister Narayana Review at Rajamahendravaram:రాజమహేంద్రవరంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. పుష్కరాలకు కేంద్ర నిధులు మంజూరు చేసే విధంగా ముఖ్యమంత్రి వద్ద చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని చెప్పారు. రాజమహేంద్రవరం కాకినాడ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాలు పట్టణాల మధ్య చెత్తతో విద్యుత్తు తయారీ ప్లాంట్లను నెలకొల్పుతామని అన్నారు. గుంటూరు, విశాఖలో ఈ ప్లాంట్లు అద్భుతంగా పనిచేస్తున్నాయని మంత్రి చెప్పారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సమీక్ష సమావేశం మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజమహేంద్రవరం నగరంలో వివిధ పన్నులు 70 కోట్ల బకాయిలు ఉన్నాయని ప్రజలు వాటిని చెల్లించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు చేశారు. మూడు సంవత్సరాల్లో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని వచ్చే జనవరికి 62,000 కోట్లతో టెండర్లు పిలుస్తామని తెలిపారు.
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు - తొలి ఫేజ్లో 42స్టేషన్లు!
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పురపాలక నగరపాలక సంస్థల నిధులను దారిమళ్లించిందని ప్రజలపై దారుణంగా పన్నుల భారం మోపిందని నారాయణ అన్నారు. ఈ సమీక్షా సమావేశానికి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకట్రావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కలెక్టర్ ప్రశాంతి, కమిషనర్ కేతన్ గార్గ్ పాల్గొన్నారు.