AP TET Results Released 2024 :ఏపీఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ ఫలితాలు విడుదల చేసినట్లు మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇందులో 50.79 శాతం మంది అర్హత సాధించారని లోకేశ్ తెలిపారు. ఫలితాల్లో 1,87,256 మంది అర్హత సాధించినట్లు చెప్పారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని వివరించారు. ఫలితాలను https://cse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని లోకేశ్ వెల్లడించారు.
అదేవిధంగా ఫలితాలనుhttps://aptet.apcfss.in https://www.eenadu.net https://pratibha.eenadu.net వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. అక్టోబరు 3 నుంచి 21 వరకు టెట్ నిర్వహించారు. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 29న తుది కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. 3,68,661 మంది హాజరయ్యారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీకి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.