Nara Lokesh on AP TET Results: ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి అందరూ సన్నద్ధం కావాలని విద్యశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. గత మూడు నెలలుగా ఎదురుచూస్తున్న ఏపీ టెట్ ఫలితాలను ఈరోజు విడుదల చేశానన్నారు. టెట్‌లో (Teacher Eligibility Test) అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజి ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2.35 లక్షలమంది నిరుద్యోగ టీచర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు.
ఇప్పుడు అర్హత సాధించని వారికి మరోసారి టెట్: టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఈ టెట్‌లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఆ తరువాత మెగా డీఎస్సీ ఉండబోతుందని తెలిపారు. https://cse.ap.gov.in లింక్ ద్వారా టెట్ ఫలితాలను తెలుసుకోవచ్చు
నేడు విడుదలైన టెట్-2024 ఫలితాలలో 58.4 శాతం అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించారు. టెట్-2024లో లక్షా 37 వేల 904 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించగా, ఇప్పుడు అర్హత సాధించని వారికి మరోసారి టెట్ నిర్వహిస్తామని నారా లోకేశ్ తెలిపారు. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తయిన వారికి కొత్త టెట్‌లో అవకాశం కల్పిస్తామన్నారు.
విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలి : మంత్రి నారా లోకేశ్ - Teachers Unions Meet Lokesh
Minister Nara Lokesh Praja Darbar: ఆరు నెలల్లో స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని మంత్రి నారా లోకేశ్ స్పష్టంచేశారు. సమస్యల పరిష్కారం కోసం సామాన్యులు, ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజాదర్బార్‌కు తరలివచ్చారు. ఉండవల్లి నివాసంలో లోకేశ్‌ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంగళగిరికి చెందిన లక్ష్మీనరసింహా గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం: మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని మంగళగిరిని గోల్డ్ హబ్‌గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని లోకేశ్ అన్నారు. ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఉండవల్లి పంచాయతీలో మహిళా పారిశుద్ధ్య కార్మికులపై లైంగిక వేధింపులతోపాటు ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రైట్ హ్యాండ్‌గా పేరుగాంచిన రాంబాబును విధుల నుంచి తొలగించాలని ఫిర్యాదు చేశారు. మహిళా కార్మికులపై ఇష్టానుసారంగా వ్యక్తిగత దూషణలకు దిగడంతోపాటు వేతనం తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.
మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ మొదటి సంతకం - నిరుద్యోగ సంఘాల హర్షం - JAC Unions Thankful to Lokesh