ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడ పోర్టును ద్వారంపూడి కుటుంబం ఆక్రమించింది: మంత్రి నాదెండ్ల - Nadendla Manohar on Ration Rice - NADENDLA MANOHAR ON RATION RICE

Minister Nadendla Manohar on Ration Rice Mafia in Kakinada: కాకినాడ రేషన్ మాపియాకు అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గోదాంలను పరిశీలించిన నాదెండ్ల 5,300 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చెయ్యాలని ఆదేశించారు. బియ్యం మాఫియా అక్రమాల కేసును సీఐడీకి అప్పగిస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

nadendla_manohar_on_ration_rice
nadendla_manohar_on_ration_rice (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 4:40 PM IST

Updated : Jun 29, 2024, 9:23 PM IST

Minister Nadendla Manohar on Ration Rice Mafia in Kakinada:కాకినాడ కేంద్రంగా రేషన్‌ బియ్యం మాఫియాపై ప్రభుత్వం దృష్టి సారించింది. కాకినాడలో రెండ్రోజులుగా మకాం వేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ గోదాముల్లో తనిఖీలు చేశారు. అశోక ఇంటర్నేషనల్, హెచ్ 1 గోదాంను పరిశీలించిన మంత్రి నాదెండ్ల 5,300 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చెయ్యాలని ఆదేశించారు. గోదాంలోని నిల్వలపై స్టాక్‌ రిజిష్టర్​ లేకపోవడంతో నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

బియ్యం మాఫియా అక్రమాల కేసును సీఐడీకి అప్పగిస్తామని నాదెండ్ల తెలిపారు. కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్‌ సరకులు వెళ్తున్నాయని చెప్పారు. కాకినాడ పోర్టు అంటేనే అందరూ భయపడుతున్నారని నాదెండ్ల చెప్పారు. కాకినాడ పోర్టును ద్వారంపూడి కుటుంబం ఆక్రమించిందని మండిపడ్డారు. పోర్టును ఆక్రమించిన ద్వారంపూడి కుటుంబం ఎన్నో అన్యాయాలు, అక్రమాలు చేసిందని విమర్శించారు. రేషన్‌ బియ్యం అక్రమాలపై తనిఖీ కోసం బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు.

జగన్ రివర్స్ టెండరింగ్​తో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం: లంకా దినకర్ - Lanka Dinkar on Polavaram Project

రేషన్‌ మాఫియాకు కాకినాడ అడ్డా:పౌరసరఫరాల శాఖ ఎండీ, జేసీతో ఓ బృందం తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు. తనిఖీలు పూర్తయ్యేవరకు బియ్యం ఎగుమతులు ఆపేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రేషన్‌ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టోల్‌గేట్‌ల వద్ద సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరుపుతామని నాదెండ్ల తెలిపారు. కాకినాడలో తొలిరోజు తనిఖీల్లో 6 గోదాముల్లో లోపాలు గుర్తించినట్లు తెలిపారు. కాకినాడలో ఒక వ్యవస్థీకృత మాఫియా ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి రేషన్‌ మాఫియా సొంత నౌకనే ఏర్పాటు చేసుకునే స్థాయిలో ఉందని అన్నారు.

కాకినాడ పోర్టును ద్వారంపూడి కుటుంబం ఆక్రమించింది. పోర్టును ఆక్రమించి ద్వారంపూడి కుటుంబం ఎన్నో అక్రమాలు, అన్యాయాలు చేసింది. రేషన్‌ బియ్యం అక్రమాలపై తనిఖీ కోసం పౌరసరఫరాల శాఖ ఎండీ, జేసీతో బృందాన్ని ఏర్పాటు చేస్తాం. తనిఖీలు పూర్తయ్యేవరకు బియ్యం ఎగుమతులు ఆపేయడం జరుగుతుంది. బియ్యం మాఫియా అక్రమాల కేసును సీఐడీకి అప్పగిస్తాం. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.- నాదెండ్ల మనోహర్‌, పౌరసరఫరాలశాఖ మంత్రి

మీ కష్టాలు చూసి చలించిపోయా - పింఛన్‌దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ - CM Chandrababu Open Letter

విజయవాడ బస్టాండ్​ను గాలికొదిలేసిన వైఎస్సార్సీపీ - వసతుల లేమితో ప్రయాణికులు విల విల - Lack of Facilities in RTC Bus Stand

Last Updated : Jun 29, 2024, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details