తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్లు చెడిపోతే కాంట్రాక్టర్లతో పాటు అధికారులు కూడా బాధ్యత వహించాల్సిందే : మంత్రి కోమటిరెడ్డి - minister komatireddy venkat reddy

Minister Komatireddy review on Roads : రాష్ట్రంలో రోడ్లు చెడిపోతే కాంట్రాక్టర్లతో పాటు అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఆర్‌అండ్‌బీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకరిద్దరు అధికారుల వల్ల ప్రజల జీవితాలు ప్రభావితమైతే, చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జాతీయ రహదారుల నిర్మాణ పనుల వేగం పెంచాలని ఆయన అధికారులకు సూచించారు.

Minister Komatireddy review on RRR
Minister Komatireddy review on Roads (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 4:37 PM IST

Minister Komatireddy review on RRR : ప్రజలకు మెరుగైన రహదారులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ, రాష్ట్ర, ఇతర రహదారులు, ఇతర భవన నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో మంత్రి ఉదయం నుంచి విభాగాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు.

రోడ్లు, ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి - Minister Komatireddy on Road Works

రోడ్లు చెడిపోతే కాంట్రాక్టర్లతో పాటు అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకరిద్దరు అధికారుల వల్ల ప్రజల జీవితాలు ప్రభావితమైతే, చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జాతీయ రహదారుల నిర్మాణ పనుల వేగం పెంచాలని అధికారులకు సూచించారు. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు ఓఆర్ఆర్‌కు అనుసంధాన రోడ్లు నిర్మించేందుకు స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని మంత్రి అధికారులకు తెలిపారు.

హైదరాబాద్ విజయవాడ రహదారిపై బ్లాక్ స్పాట్లు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని, ఈ మార్గాన్ని గ్రీన్ ఫీల్డ్ హైవేగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఏళ్లుగా నత్తనడకన సాగడంపై అధికారులను ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్ ఇన్సాల్వెన్సీ పనుల్లో ఆలస్యం జరుగుతోందని అధికారులు తెలపగా, ప్రజలు రోజూ ఇబ్బంది పడుతుంటే ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పనులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టర్‌ను మార్చడం లేదా గడువు పొడిగించి పనులను వేగవంతం చేయాలని, మంత్రి అధికారులకు సూచించారు. అంబర్‌పేట్ ప్లైఓవర్ పనులు తుది దశకు చేరాయని, మరో నెల రోజుల్లో ట్రాఫిక్‌కు అనుమతించనున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, ఆ తర్వాత 4.4 కిలోమీటర్ల 6 లేన్ల రహదారి విస్తరణ 82 శాతం పూర్తయ్యిందని, అటవీ అనుమతులు రాగానే మిగతా సుమారు కిలోమీటరు పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

అటవీశాఖ అధికారులతో ఒకటి, రెండు రోజుల్లో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. హైదరాబాద్– బెంగళూర్ జాతీయ రహదారిపై 1.15 కిలోమీటర్ల వెహికిల్ అండర్ పాస్ సగానికి పైగా, ఎల్బీనగర్ నుంచి మల్లాపూర్ 22.5 కి.మీ. 6 లేన్ల విస్తరణ పనులు 54 శాతం పూర్తయినట్లు తెలిపారు. హైదరాబాద్ - పుణె రహదారిపై బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ 33.3 శాతం, హగ్గిరి - జడ్చర్ల పనులు 94 శాతం, మహబూబ్ నగర్ – జడ్చర్ల 4 లేన్ల విస్తరణ పనులు 95 శాతం, నకిరేకల్ -నాగార్జునసాగర్ 85 కిలోమీటర్లు పనులు దాదాపు 92 శాతం, జడ్చర్ల– కల్వకుర్తి 4 లేన్ల విస్తరణ పనులను 31 శాతం, నిర్మల్ – ఖానాపూర్ రహదారి పనులు దాదాపు 97 శాతం పూర్తయినట్లు అధికారులు వివరించారు. రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకొని, నిర్ణీత కాలవ్యవధిలో పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలన్నీ బయటపడతాయి - కేసీఆర్ అరెస్టు కాక తప్పదు : కోమటిరెడ్డి - Komatireddy about Phone Tapping

లోక్​సభ ఫలితాల తర్వాత బీఆర్ఎస్​లో ఎవరూ ఉండరు : మంత్రి కోమటిరెడ్డి - Komati Reddy Shocking Comments

ABOUT THE AUTHOR

...view details