ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం: మంత్రి కొల్లు రవీంద్ర - Free Sand Distribution

Minister Kollu Ravindra Talk About Free Sand Distribution : ఉచిత ఇసుక విధానంపై కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రవీంద్ర సృష్టం చేశారు. ఉచిత ఇసుక ప్రతీ రోజూ, ప్రతీ ఒక్కరికీ అందుబాటులో తేవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 7:29 PM IST

free_sand_ap
free_sand_ap (ETV Bharat)

Minister Kollu Ravindra Talk About Free Sand Distribution :ఉచిత ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కొత్త ఇసుక విధానంపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత లేకుండా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.రవాణా ఛార్జీలు, తవ్వకాలపై ఆయా జిల్లాల కలెక్టర్​లు మార్గదర్శకాలు జారీ చేస్తారన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు ఇసుకను దొరక్కుండా చేశారని వైఎస్సార్సీపీ అక్రమాలపై విచారణ జరుగుతుందన్నారు.

ఇసుక పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం: మంత్రి కొల్లు రవీంద్ర (ETV Bharat)

గత ప్రభుత్వం ఇసుక విధానం మార్చడం వల్ల లక్షలాది మంది రోడ్డున పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జగన్ సర్కారు హయాంలో తమకు ఎలా లాభం వస్తుందనే ఇసుక విధానం రూపొందించిందని మంత్రి విమర్శించారు. స్టాక్ పాయింట్​లలో ఉన్న ఇసుకను ప్రజలకు త్వరలో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ఉచిత ఇసుక విధానానికి తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. ప్రజలందరికి ఇసుక లోటు లేకుండా చేస్తామని వెల్లడించారు. వచ్చే మూడు నెలలో కోటి మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

'ఏపీ ఇసుక ఫైల్స్' తవ్విన కొద్దీ అక్రమాలు - ఆ ఒక్క సంతకంతో రూ.800 కోట్లు - AP Sand Files

గత ప్రభుత్వ హాయంలో ఇసుక అక్రమాలపై విచారణ జరుపుతామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షకాలం వల్ల నదిలో తవ్వకాలు చేపట్టటం లేదని అన్నారు. జేపీ వెంచర్స్ సంస్థ ప్రభుత్వానికి ఎంత బకాయిలు ఉన్నది త్వరలోనే తేలుస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పంపిణీ చెప్పిన హామీకి తమంతా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. జగన్​ ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమాలపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇసుక టెండర్లలో గోల్​మాల్ - జగన్‌ మార్క్‌ అడ్డాగా దోపిడీ - YSRCP Irregularities Sand Tenders

" ప్రస్తుత ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీకి కట్టుబడి ఉన్నది. ఇసుక పంపిణీపై నిరంతరం పర్యవేక్షిస్తాము. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుంది. ప్రతి ఒక్కరికీ ఉచిత ఇసుక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. ఇసుక పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాము. వర్షాలు పడినా ఇసుక పంపిణీకి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటాము"_ మంత్రి కొల్లు రవీంద్ర

ప్రభుత్వం మారినా ఆగని వైఎస్సార్సీపీ నేతల ఇసుక దందా - Sand Mafia Police Seized Vehicles

ABOUT THE AUTHOR

...view details