ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"పెద్దల సభ అని గుర్తుంచుకోండి - 'సోషల్ సైకో'లకు ఎలా మద్దతిస్తారు?" - SOCIAL MEDIA ISSUE IN ASSEMBLY

సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ - ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టిన వైఎస్సార్సీపీ సభ్యులు

Minister Gottipati Ravikumar Fire on YSRCP Member
Minister Gottipati Ravikumar Fire on YSRCP Member (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2024, 1:23 PM IST

Minister Gottipati Ravikumar Fire on YSRCP Member :సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై శాసనమండలిలో వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన చేశారు. ఆ పార్టీ సభ్యుల ప్రవర్తన పట్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్య పదజాలంతో సందేశాలు పంపుతూ, బాధిత కుటుంబాలను మానసిక క్షోభకు గురిచేసే వారికే ఆ పార్టీ నేతలు మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు. వారికి మద్దతుగా మాట్లాడటానికే వైఎస్సార్సీపీ సభ్యులు పెద్దల సభ(మండలి)కు రావడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సైకోల వ్యవహార శైలిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు కుటుంబాన్ని అవమానిస్తుంటే, అప్పటి సభలో సీఎం హోదాలో ఉన్న జగన్, మిగిలిన వైఎస్సార్సీపీ సభ్యులు వెకిలి నవ్వులు నవ్వారని గుర్తు చేశారు.

ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేలా బడ్జెట్‌ - ఎమ్మెల్యేల ప్రశంసలు

సభ కార్యక్రమాలకు అంతరాయం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత కుటుంబ సభ్యులతో పాటు జగన్ చెల్లిని కూడా సభ్య సమాజం తలించుకునేలా సోషల్ మీడియాలో వేధించారని మండిపడ్డారు. పెద్దల సభకు వచ్చిన వైఎస్సార్సీపీ సభ్యులు సోషల్ మీడియా సైకోలకు మద్దతుగా మాట్లాడమేగాక మండలి కార్యక్రమాలకు అంతరాయం కలిగించేలా పెద్దల సభ పోడియాన్ని చుట్టు ముట్టడం దుర్మార్గపు చర్యని మంత్రి దుయ్యబట్టారు. ప్రజలకు ఉపయోగకరమైన ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో ఎంతో విలువైన పెద్దల సభా సమయాన్ని వృథా చేయడాన్ని ఆక్షేపించారు. సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్న వైఎస్సార్సీపీ సభ్యుల చర్యలు బాధాకరం అని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు.

శాసనసభ, మండలిలో చీఫ్‌ విప్‌లు, విప్‌లు వీరే

వారికే వత్తాసు పలుకుతారా? : శాసనమండలిలో ప్రజల సమస్యలపై ప్రస్తావించాల్సింది పోయి ఆందోళన చేస్తారా? అని వైఎస్సార్సీపీ సభ్యులను ఉద్దేశించి మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్‌ తల్లి, చెల్లిని చదవలేని భాషలో పోస్టులు పెడితే వారికి వత్తాసు పలుకుతారా? అని ప్రశ్నించారు. సభ ప్రారంభమైన తర్వాత సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్టుల అంశంపై చర్చించాలని వైఎస్సార్సీపీ తీర్మానం ఇచ్చింది. దీనిని మండలి ఛైర్మన్‌ మోషేను రాజు తిరస్కరించారు. దీంతో ఆ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన మధ్యే మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగించారు.

పెండింగ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తాం - రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తి : లోకేశ్

ABOUT THE AUTHOR

...view details