Mulugu Medical Officer Treks For 16 Km to Provide Medical Services : కిలోమీటర్ల కొద్ది ప్రయాణించి అడవుల్లో నివాసం ఉంటున్న గిరిజనులకు స్వయంగా వైద్య సేవలు అందించిన ములుగు జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ అల్లెం అప్పయ్యకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అభినందనలు తెలిపారు. కొండలు ఎక్కి, వాగులు దాటి ఆదివాసీలకు వైద్యాన్ని అందించడాన్ని స్వాగతిస్తూ డీఎంహెచ్‌వో సేవలను మంత్రి కొనియాడారు. ఈటీవీ భారత్‌లో వచ్చిన 'వర్షాన్ని లెక్కచేయకుండా వాగులు, వంకలు దాటుతూ వైద్య సేవలు' కథనంపై మంత్రి స్పందించారు.
మూలాలు మరవకుండా : వర్షాకాలం మొదలైతే చాలు సీజనల్ వ్యాధులు విపరీతంగా పెరిగిపోతుంటాయి. నగరాల్లో ఉన్నవారికైతే సమీపంలో ఆసుపత్రులు అందుబాటులో ఉంటాయి కాబట్టి వైద్యాన్ని సకాలంలో చేయించుకుంటారు. గ్రామాల్లో అయితే టౌన్‌కు వెళ్తారు. మరి కొండ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు వైద్యం సదుపాయాలు ఎలా? వారికి వ్యాధులు సక్రమిస్తే నయం చేసే మార్గమేంటి?
వైద్యులారా వందనం!! - కొండలు వాగులు దాటి గిరిజనులకు వైద్యసేవలు - Health Camp In Mulugu
గిరిజనులు ఎక్కడికి వెళ్లాలన్నా కొండలు, వాగులు దాటాల్సిందే. సాంకేతికత, వైద్య సదుపాయాలు విస్తృతంగా పెరిగినా అలాంటి ప్రాంతాల్లో సేవలు అందించడమంటే సావాలే. కానీ ఆ వైద్యుడు అలా ఆలోచించలేదు. గిరిజన ప్రాంతం నుంచి వచ్చి తాను జిల్లా వైద్యాధికారిగా పదోన్నతి పొందినా తన మూలాలు మరవకుండా అక్కడ ఉండే సమస్యలను తన వంతుగా తీర్చాలి అనుకున్నాడు. ఆ కష్టాలను తెలిసిన వాడై భారీ వర్షాలు పడుతున్నా కొండ ప్రాంతాలకు వెళ్లి గిరిజనులకు వైద్య సేవలు అందించాడు.
ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లం అప్పయ్య ఆ జిల్లాలోని వాజేడు మండల కేంద్రానికి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు గ్రామంలో సిబ్బందితో కలిసి వైద్యం అందించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి అందరికి అవగాహన కల్పించారు. శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్ష లు నిర్వహించగా ఇద్దరికి మలేరియా నిర్ధారణ జరగడంతో వారికి మందులు ఇచ్చారు. గ్రామంలోని ప్రతి ఇంటి వెళ్లి దోమతెరలు, మందులు ఇచ్చి వ్యాధుల గురించి వివరంగా చెప్పారు.
సమాజ సేవకోసం పెళ్లికి నో- అంబులెన్స్‌తో వైద్య సేవలు- అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు! - Social Worker Satish Chopra
రూపాయికే వైద్య సేవలు.. ఉచితంగానే మందులు.. ముఖ్యమంత్రే ఆదర్శం!