Mining Officers Rides in Martur: బాపట్ల జిల్లాలోని టీడీపీ మద్దతుదారులు, నేతలకు చెందిన గ్రానైట్ పరిశ్రమల్లో, భూగర్భగనుల శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశానుసారం మైనింగ్ అధికారులు మార్టూరులోని తెలుగుదేశం పార్టీ నేతలకు చెందిన పలు గ్రానైట్ పరిశ్రమలతోపాటు, అనంత గ్రానైట్స్‌లో తనిఖీలు నిర్వహించారు.
టీడీపీ పట్టణ అధ్యక్షుడు కామినేని జనార్దన్ మార్టూరులోని నాగరాజుపల్లి రోడ్డులోని అనంత గ్రానైట్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరిశ్రమలో మైనింగ్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మైనింగ్ అధికారులు సోదాలు నిర్వహించడాన్ని జనార్ధన్ తప్పుబట్టారు.
ప్రతిపక్ష పార్టీకి సానుభూతిపరుడ్ని కావడంతోనే ఈసోదాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పరిశ్రమల్లో కాకుండా కేవలం తన పరిశ్రమలోనే ఈ సోదాలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు దిగుతూ, ఇలాంటి చర్యలకు పాల్పడడం సరైంది కాదని మండిపడ్డారు.
కృష్ణ చైతన్య గ్రానైట్ క్వారీలో గనుల శాఖ తనిఖీలు - కక్షసాధింపు చర్యల్లో భాగమేనా?
మైనింగ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న పలువురు గ్రానైట్ పరిశ్రమల యజమానులు అనంత గ్రానైట్స్ వద్దకు చేరుకున్నారు. అధికారులు కేవలం టీడీపీ నేతల పరిశ్రమల్లోనే సోదాలు నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అనంత గ్రానైట్స్ వద్దకు చేరుకున్నారు. తనిఖీలకు వచ్చిన మైనింగ్ ఉన్నతాధికారి వాహనంలో కర్రలు, కారం పొడి వంటివి ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన ఏవిధంగా జరుగుతుందో, మైనింగ్ అధికారుల సోదాల వల్ల బహిర్గతమైందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. ఏపీ మైనింగ్ శాఖ ఉన్నతాధికారి వెంకటరెడ్డి గత ఐదు సంవత్సరాలుగా, ప్రైవేటు మాఫియాను నడుపిస్తున్నారని ఏలూరి ఆరోపించారు. ఈ వ్యవస్థను నడుపుతూ పారిశ్రామిక యాజమానుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆయన అన్నారు.
దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఏపీ గనుల శాఖ
బెదిరింపులకు పాల్పడుతూ వసూల పర్వానికి తెరలేపారని ఆరోపించారు. ఇతర జిల్లాలకు చెందిన గ్రానైట్ అధికారులతో విజిలెన్సు బృందాలను నియమించి, వారితో ప్రైవేటు వ్యక్తులను తనిఖీలకు పంపిస్తున్నారని ఏలూరి అన్నారు. ప్రతిపక్షల సానుభూతిపరుల పరిశ్రమలను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మార్టూరు ప్రాంతంలో ప్రైవేటు సైన్యంతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకుని, నిత్యం వసుళ్ల పర్వాన్ని వైఎస్సార్సీపీ ముఖ్యనేత కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇంతా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ధ్వజమెత్తారు.
మైనింగ్ లక్ష్యాలపై గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
కేవలం టీడీపీ సానుభూతిపరుల పరిశ్రమ్లలోనే సోదాలు ఎందుకు : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు