తెలంగాణ

telangana

ETV Bharat / state

రామగుండం ఓపెన్​కాస్ట్‌ గనిలో ప్రమాదం - మట్టి పెళ్లలు పడి ఇద్దరు మృతి - Mine Accident In Ramagundam - MINE ACCIDENT IN RAMAGUNDAM

Mine Accident In Ramagundam : పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓపెన్‌ కాస్ట్‌ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. పైప్‌లైన్‌ లీకేజీని అరికట్టేందుకు నలుగురు కార్మికులు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు మీదపడ్డాయి. దీంతో మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడక మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు.

Mine Accident In Ramagundam
Mine Accident In Ramagundam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 7:47 PM IST

Updated : Jul 17, 2024, 10:48 PM IST

Mine Accident In Ramagundam :పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని లడ్నాపూర్‌ ఓపెన్‌కాస్ట్‌-2లో ప్రమాదం జరగడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పైప్‌లైన్‌ లీకేజీని అరికట్టేందుకు ఒక ఫిట్టర్‌తో పాటు మరో ముగ్గురు కార్మికులు మరమ్మతులు చేస్తుండగా పక్కనే ఉన్నమట్టి దిబ్బలు కూలినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

మట్టిదిబ్బలు కూలడంతో అందులో కూరుకుపోయిన ఫిట్టర్‌ వెంకటేశ్వర్లుతో పాటు జనరల్‌ మజ్దూర్‌ విద్యాసాగర్‌ ఊపిరాడక చనిపోయారు. మరో ఇద్దరు కార్మికుల్లో శ్రీనివాస్‌ రాజు, సమ్మయ్య స్వల్పగాయాలతో బయట పడ్డారు. మట్టిలో కూరుకుపోయిన ఇద్దరి మృతదేహాలను గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని బోరున విలపించారు.

సింగరేణి అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక నాయకులు ఆరోపించారు. మృతి చెందిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని, ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎల్లో, రెడ్ కార్డుల పేరుతో కార్మికులను వేధింపులకు గురి చేయడం సరైన విధానం కాదన్నారు.

మరోవైపు ఈ ఘటనపై సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్‌ స్పందించారు. బాధిత కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చిన బలరామ్, ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించారు. ఇటువంటి ప్రమాదాలు భ‌విష్య‌త్​లో జ‌ర‌గ‌కుండా ప‌టిష్ట‌మైన‌ జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని స్థాయిల అధికారులను, ఉద్యోగులకు సూచించారు.

Last Updated : Jul 17, 2024, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details