NEET PG Exam 2024 : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ 2024 (NEET PG 2024) టెస్ట్ సిటీల జాబితాను విడుదల చేసింది. NEET PG 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న, ఆగస్టు 11వ తేదీ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులందరూ చెక్ చేసుకోవచ్చు. NBEMS అధికారిక వెబ్‌సైట్ https://natboard.edu.in/ లో జాబితా విడుదల చేయబడింది.
నీట్ పీజీ 2024 పరీక్ష దేశవ్యాప్తంగా 185 పరీక్షా నగరాల్లో నిర్వహించనున్నారు. ఆగస్టు 8వ తేదీన NEET PG 2024 పరీక్ష కోసం విడిగా అడ్మిట్ కార్డ్‌లు విడుదల చేయనున్నారు. అభ్యర్థులందరూ తమ ప్రాధాన్య పరీక్ష నగరాల ఆప్షన్లను ఉపయోగించడం ద్వారా వారి పరీక్ష నగరాన్ని మళ్లీ ఎంచుకోవచ్చు. విండో ఇప్పుడు ఓపెన్ అయి ఉంది. ఈ ఆప్షన్ జూలై 22వ వరకు అందుబాటులో ఉంటుంది. కానీ ఇక్కడే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తాయి. సాంకేతిక సమస్యలతో ఆ విండో ఓపెన్ కావడం లేదు. దీంతో అభ్యర్థులంతా ఆందోళనకు గురవుతున్నారు. వైబ్సైట్లో పత్రాలు అప్లోడ్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైనా స్పందన లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.