Metro Super Saver Holiday Card Extended :ఉగాది పండుగ వేళమెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తీపి కబురు అందించింది. మెట్రో రైలులో వేర్వేరు వర్గాలకు అందిస్తున్న రాయితీలు మార్చి 31తో ముగియగా, వాటిని మళ్లీ పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ఉగాది వేడుకల్లో భాగంగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్(Metro Student Pass), సూపర్ పీక్ అవర్ ఆఫర్లను ఆరు నెలల పాటు పొడిగించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
సెలవు రోజుల్లో 59 రూపాయలకే ప్రయాణ సదుపాయం కల్పించే సూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డుతోపాటు, రద్దీ లేని సమయాల్లో ప్రయాణ ఛార్జీల్లో(Travel Fare) 10 శాతం రాయితీ ఇచ్చే సూపర్ ఆఫ్ పీక్ అవర్ సహా మెట్రో స్టూడెంట్ పాస్‌లపై రాయితీలన్నీ మార్చి 31 తోనే మెట్రో అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రాయితీలను మళ్లీ పునరుద్ధరిస్తారా? లేదా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది.
భాగ్యనగరానికి మరో అరుదైన గౌరవం - ‘స్టాన్‌ఫర్డ్’లో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విజయగాథ
ఈ మేరకు ప్రయాణికుల నుంచి ఒత్తిడి రావడంతో స్పందించిన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉగాది కానుకగా మళ్లీ ఆ కార్డులను పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు. ఈ రాయితీలను(Metro Concession) పొడిగించడం ద్వారా మెట్రో ప్రయాణాన్ని మరింత పెంచాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు కట్టుబడి ఉందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. మూడు మార్గాల్లో గల మెట్రో సేవలను, ప్రతిరోజు సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. పనిదినాల్లో రద్దీ ఎక్కువగా ఉంటే, వారాంతాల్లో తక్కువగా ఉంటోంది. వేసవి కావడంతో వెహికల్స్‌ను స్టేషన్ల వద్ద నిలిపి మెట్రోలోనే ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు.
Hyderabad Metro Services Extended :హైదరాబాద్ నగర మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసిన అధికారులు, 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు చేశారు. విస్తరణలో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు మెట్రో సేవలను(Metro Services) పొడిగించనున్నారు. కొత్తగా మరో నాలుగు కారిడార్లలో నిర్మాణం చేపట్టనున్నారు. వీటి నిర్మాణం పూర్తైతే ప్రయాణికులకు మరింత ట్రావెల్ సౌకర్యం చేరువవుతుంది.
Traction Power Generation In Metro : మెట్రో రైళ్లకు విద్యుత్ వాడకమే కాదు.. తయారు చేయడం తెలుసు..
డ్రైవర్‌లెస్ మెట్రో రైలు- ట్రయల్ రన్‌కు రెడీ- ఎక్కడంటే?