తెలంగాణ

telangana

ETV Bharat / state

పాటలు, డాన్స్​, కవితలు ఇవన్నీ మీకు వచ్చా?- అయితే సూపర్​ ఛాన్స్​ ఇచ్చిన మెట్రో ఎండీ - METRO MD ON NEW TRAINS ON HYDERABAD

తర్వలో మరో పది మెట్రో రైళ్లు అందుబాటులోకి - తెలిపిన ఎల్​అండ్​టీ ఎండీ కేవీబీ రెడ్డి - ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి 57 రైళ్లు

Metro MD On New Trains on Hyderabad
Metro MD On New Trains on Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2025, 7:55 PM IST

Metro MD On New Trains on Hyderabad :మెట్రో ప్రయాణికులకు ఎల్అండ్​టీ ఎండీ కేవీబీ రెడ్డి శుభవార్త చెప్పారు. 18 నెలల్లో మరో 10 మెట్రో రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఇప్పటికే 57 మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయని మరో పది రైళ్లు అందుబాటులోకి వస్తే మొత్తం 67 రైళ్లు అవుతాయన్నారు. నగరంలో ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాలంటే మెట్రోనే సరైన ఎంపికని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. తక్కువ సమయంలో గమ్య స్థానానికి చేరుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని అందుబాటులోకి :హైదరాబాద్​ను విశ్వనగారంగా మార్చడంలో మెట్రో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్​లో జరిగిన 'మీ టైమ్ ఆన్​ మై మెట్రో' కార్యక్రమంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. నగర ప్రయాణికులను మెట్రో వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని ఎల్​అండ్​టీ ఎండీ కేవీబీ రెడ్డి పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఇప్పటికే మూడు మెట్రో రైళ్ల తయారీ సంస్థలకు ఆర్డర్​ ఇచ్చామని తెలిపారు.

పాటలు, డాన్స్​, కవితలు ఇవన్నీ మీకు వచ్చా?- అయితే సూపర్​ ఛాన్స్​ ఇచ్చిన మెట్రో ఎండీ (ETV Bharat)

హైదరాబాద్​కు సోల్​గా మెట్రో : ప్రతి నగరానికి ఒక సోల్ ఉంటుందని అందులో భాగంగానే హైదరాబాద్ సామాజిక, ఆర్థిక పరిస్థితులు ప్రతిబింబించే విధంగా మెట్రో నిర్మాణం చేపట్టామని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. వంద ప్రాజెక్టుల్లో మెట్రో ఒక అద్భుత బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్​గా రూపుదిద్దుకుంది అన్నారు. హైదరాబాద్​లో 90 లక్షల వాహనాలు ఒక్కసారి రోడ్డు మీదకు వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుందన్నారు. ఈ ట్రాఫిక్​లో ప్రయాణించాలంటే చాలా కష్టమని, ఎక్కువ సమయం సైతం పడుతుందని, మెట్రోలో ప్రయాణంతో తొందరగా గమ్య స్థానాలకు చేరుతానన్నారు.

మెట్రో విస్తరణపై సమీక్ష - అప్పుడే టెండర్లు పిలవాలని నిర్ణయం

వారందరికి మంచి అవకాశం : ప్రజల్లో ఉన్న క్రియేటివిటీని ప్రదర్శించే అద్భుత అవకాశం మెట్రో కల్పిస్తుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, కవిత్వం చెప్పడం వంటి టాలెంట్​ను మెట్రో ప్రోత్సహిస్తుందన్న ఆయన అందులో భాగంగానే 'మీ టైమ్ ఆన్ మై మెట్రో' అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అన్నారు. ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఎంజీబీఎస్​తో పాటు మరికొన్ని స్టేషన్​లలో ఈ అవకాశం కల్పించామని చెప్పారు. మెట్రో ఫెస్ట్​లో భాగంగా ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సంక్రాంతి సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ మానిటరింగ్ చేస్తున్నారని, రెండో దశ డీపీఆర్​లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారన్నారు. మెట్రో రెండో దశలో మొదటి ఐదు, మరో మూడు కారిడార్​లకు సంబంధించి ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి సైతం దిల్లీలో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 'మీ టైం ఆన్ మై మెట్రో' స్మార్ట్ కార్డును మెట్రో ఎండీ లాంచ్ చేశారు. మెట్రో రైళ్లలో డ్యాన్సులు, ఇతరత్ర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే చేష్టలు చేయొద్దన్నారు.

పాతబస్తీ మెట్రోలో కీలక ఘట్టం - ఇక పనులు మొదలెట్టడమే!

హైదరాబాద్‌ వాసులకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం - మేడ్చల్‌, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details