ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - RAIN ALERT FOR AP

మరో 48 గంటల్లో వర్షాలు - గంటకు 35-45 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

WEATHER_UPDATE
Meteorological Department Warning (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

Meteorological Department Warning :నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. తీవ్ర అల్పపీడనం వల్ల మరో 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని, గంటకు 35-45 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర, దక్షిణకోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచనలు ఉన్నాయంది. మూడ్రోజులపాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణశాఖ హెచ్చరించింది.

అలర్ట్​ - బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తరాంధ్రలో రెండ్రోజులు భారీ వర్షాలు

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details