ETV Bharat / state

2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల - సీఎం ఏమన్నారంటే! - MINISTER NIMMALA ON POLAVARAM

2026 నాటికి పునరావాసం పూర్తి చేస్తామన్న మంత్రి - 2027కు ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చుతామని హామీ

Minister Nimmala Rama Naidu On Polavaram Project
Minister Nimmala Rama Naidu On Polavaram Project (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2024, 7:42 PM IST

Minister Nimmala Rama Naidu On Polavaram Project : 2027 డిసెంబర్ నాటికి పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చుతామని జవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 70 శాతం పూర్తయిన పోలవరం పనులను గత ప్రభుత్వం నిలిపివేసి ప్రాజెక్టును అటకెక్కించిందని మండిపడ్డారు. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా పనులను పరుగులు పెట్టించేలా సీఎం చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించారని తెలిపారు. రెండో దశలో నిధుల కోసం కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని 'ఈటీవీ - ఈటీవీ భారత్'​కు వివరించారు. 2026 నాటికి పునరావాసం కూడా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

CM Chandrababu Visits Polavaram : సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే. ముందుగా విహంగ వీక్షణం ద్వారా సీఎం ప్రాజెక్టును పర్యవేక్షించారు. తర్వాత హిల్‌ వ్యూ పాయింట్‌ నుంచి ప్రాజెక్టుని పరిశీలించారు. పోలవరం గ్యాప్‌ -1, గ్యాప్​-2, డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులను సీఎం పరిశీలించారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులను సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులు, ప్రాజెక్టు ఇంజినీర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు భవిష్యత్తు నిర్మాణాల షెడ్యూల్​ను విడుదల చేశారు. ప్రాజెక్టుని పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.

'పోలవరం పూర్తయ్యేది అప్పుడే - టార్గెట్ ప్రకటించిన సీఎం చంద్రబాబు

పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు అని సీఎం అన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి తెలిపారు. పోలవరం వల్ల 7 లక్షల 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుందని వెల్లడించారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.

పోలవరం పూర్తిచేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్‌ ఛేంజర్‌గా తయారవుతుందని చెప్పారు. పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశామన్న సీఎం, గొల్లాపల్లి రిజర్వాయర్‌ వస్తే చాలావరకు ఇబ్బంది ఉండదని వెల్లడించారు. వెలిగొండ ఇరిగేషన్‌కు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని, అక్కణ్నుంచి బనకచర్లకు తీసుకెళ్లొచ్చని అన్నారు. నేరుగా విశాఖకు తరలిస్తూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధారకు వెళ్తుందని, ఇవి పూర్తిచేయగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఉపయోగకరమని చంద్రబాబు పేర్కొన్నారు.

పోలవరం ఎత్తుపై రాజ్యసభలో చర్చ - ఆ విషయంలో తగ్గేదేలేదని వెల్లడి

ఆ మూడు విషయాల్లో 'జీరో' ప్రగతి - వైఎస్సార్సీపీ హయాంలో పోలవరం పురోగతిపై కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.