Medium Confusion in SSC Examination in Government Schools of Andhra Pradesh :రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో తెలుగు మాధ్యమంలో పరీక్ష ఉంటుందా? లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. తెలుగు మాధ్యమంలో పరీక్షలు నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల్లోనూ అయోమయం ఏర్పడింది. దీనిపై పాఠశాల విద్యాశాఖ స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒకే మాధ్యమం అమలు చేయాలంటూ 2021 డిసెంబరు 15న ఆదేశాలు జారీ చేశారు.
ఇంతకు ముందు 2020-21లో ఒకేసారి 1-6 తరగతుల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి, ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు జీఓను రద్దు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి స్టే ఇవ్వలేదు. తెలుగు మాధ్యమం రద్దు అంశం న్యాయస్థానంలో ఉన్నందున 2021 డిసెంబరులో ఒకే మాధ్యమం ఉంటుందంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
'అమ్మా నేను ఇంగ్లిష్ మీడియం చదవలేను, నాకేమీ అర్థం కావడం లేదు'