Medigadda Barrage News Latest : మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పరిశీలనకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఆరో తేదీన వస్తుందని, అన్ని రకాలుగా సహకరిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఏ సూచనలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న ఆయన, గతంలో కుంగిపోయిన మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించి ఖాళీ చేయాలని సూచించిందని చెప్పారు. సుందిళ్ల, అన్నారం ఆనకట్టల్లో కూడా మేడిగడ్డలో ఉన్న సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా ఖాళీ చేయాలన్న నిపుణుల సూచనల మేరకే నీటిని ఖాళీ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ (BRS) రాజకీయాలు చేస్తూ నీరు నింపాలని డిమాండ్ చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి కమిటీ
Uttam Kumar Reddy: గులాబీ నాయకులకు ఎలాంటి సాంకేతిక అవగాహన లేకున్నా మాట్లాడడం దురదృష్టకరమని ఆక్షేపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న మంత్రి ఉత్తమ్ నాణ్యత, నిర్వహణ, నిర్మాణం, డిజైన్లు, అన్ని విషయాల్లో నిబంధనలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. రూ.94 వేల కోట్ల వ్యయం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఆనకట్ట గుండెకాయ లాంటిదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకుల (BRS Leaders) మాటలకు విలువ లేదన్న మంత్రి, ఆనకట్ట కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయాల్సింది పోయి, ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.
పనికిరాని మొక్కలతో రూ.లక్షల్లో ఆదాయం - కుటీర పరిశ్రమ నెలకొల్పి మహిళలకు ఉపాధి