Medicover Hospital Doctors Treated Dead Patient in Hyderabad :ఠాగూర్ సినిమాలోని హాస్పిటల్ సీన్ మీకు గుర్తుండే ఉంటుంది. అలాంటి సంఘటనలు నిజ జీవితంలోనూ ఎదురవుతున్నాయి. హైదరాబాద్ మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో ఆ సీన్ రిపీట్ అయింది. రోగి మృతి చెందినా చికిత్స చేస్తున్నామంటూ ఆసుపత్రి యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. రోగికి చికిత్స చేయడానికి అప్పటికే రూ.7 లక్షలు చెల్లించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మరో రూ. 3 లక్షల 80 వేలను చెల్లించాలని లేకపోతే వారి కుమార్తెకు చికిత్స ఆపేస్తామని డాక్టర్లు ఒత్తిడి చేసినట్లు వారి వివరించారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారంజూనియర్ డాక్టర్ నాగప్రియ అనే యువతి అనారోగ్యానికి గురైంది. కాగా చికిత్స కోసం కొన్ని రోజుల క్రితం మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో చేరింది. నిన్న రాత్రి (నవంబర్ 05)న చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందింది. కానీ ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆసుపత్రి యాజమాన్యం దాచి పెట్టిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ తనకు ట్రీట్‌మెంట్ చెయ్యాలని దాన్ని కొనసాగించాలంటే బిల్లు కట్టాలని, లేకపోతే చికిత్స ఆపేస్తామని డాక్టర్లు చెప్పారని వారు అన్నారు.