Medical Student Attack on Public With Knife in Eluru: చేతిలో కత్తి ఉందని అన్నింటికి కత్తితో సమాధానం చెప్పుకుంటూ పోతున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఎవరైనా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా, చెప్పింది వినకపోయినా మారు మాట్లాడడు. కత్తితో దాడికి (Knife Attack) దిగుతాడు అంతే. ప్రాణం పోయటం కష్టం కానీ తీయడం సులువే అన్న విషయం వైద్య విద్యార్థిగా తెలిసి కూడా అజ్ఞానిలా వ్యవహరిస్తున్నాడు. మద్యం మత్తు, ఆపై అహంకారం. దీంతో కనీసం ఏం చేస్తున్నాడనే విచక్షణ లేకుండా వరుస దాడులకు పాల్పడుతూ ఏలూరులో వీరంగం సృష్టించాడు ఓ వైద్య విద్యార్థి. ఒక రోజు వ్యవధిలో చాకుతో ఇద్దరిపై దాడి చేసి చివరకు కటకటాల పాలయ్యాడు.
అక్కయ్యపాలెం సాయిబాబా గుడిలో కత్తితో వ్యక్తి హడావుడి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన చాణక్య విదేశాల్లో వైద్య విద్య చదువుతూ ఇటీవలే ఇంటికి వచ్చాడు. బుధవారం ఏలూరు డీ మార్ట్ వద్ద కారు డ్రైవర్ హారన్ కొట్టుకుంటూ వెళుతుండగా పక్కన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చాణక్య కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే చాణక్య కారు ఆపి తన బ్యాగులోని చాకును తీసి డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి చేతులు కోసుకుపోగా ఒక వేలు తెగింది. స్థానికులు చాణక్యను పట్టుకుని టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో నిందితుడు పోలీసులపైనా తిరగబడ్డాడు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.