Medaram Sammakka Saralamma Jathara 2024 : మేడారం జాతరలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. మేడారం గద్దె మీదికి సమ్మక్క చేరుకున్నారు. చిలకలగుట్ట నుంచి వనం వీడి జనం మధ్యలోకి వచ్చారు. ఆమె రాకతో సమ్మక నామస్మరణతో మేడారం పరిసరాలు మార్మోగాయి. గాల్లోకి కాల్పులు జరిపి ఎస్పీ శబరీష్ అధికారికంగా స్వాగతం పలికారు. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారి పొడువునా ముగ్గులు వేశారు.
రెండేళ్లకోమారు జరిగే ఆదివాసీ జన జాతరలో అశేష జనవాహినితో కొత్త శోభను సంతరించుకుంది. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు భక్తులకు అభయమిస్తున్నారు. మరోవైపు చిలకలగుట్ట నుంచి సంప్రదాయ నృత్యాలు, అధికార లాంఛనాలతో సమ్మక్క తల్లిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలాచరిస్తూ ఎత్తుబంగారాలు, ఒడిబియ్యం సమర్పిస్తున్నారు.
మేడారం జాతరకు వస్తున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. వైద్య బృందాలు, పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. మరోవైపు జాతరకు వచ్చేందుకు ఇప్పటికే ఆర్టీసీ(RTC) మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు భారీగా బస్సులను అందుబాటులోకి తెచ్చింది.
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని పదేళ్లుగా కోరుతున్నాం: సీతక్క