Four Members Died in Medak Road Accident :మెదక్ జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మనోహరాబాద్ మండలం పోతారం గ్రామం వద్ద రోడ్డుపై స్థానిక రైతులు ధాన్యం ఆరబోశారు. ధాన్యం కుప్పలు ఉండడంతో రోడ్డుకు ఒకవైపు నుంచే వెహికల్స్ రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంజనేయులు తన తమ్ముడి భార్య పిల్లలను బస్ ఎక్కించడానికి బైక్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి - MEDAK ROAD ACCIDENT TODAY
మనోహరాబాద్ మండలం పోతారం వద్ద రోడ్డు ప్రమాదం - ట్రాక్టర్, బైకు ఢీకొని నలుగురు దుర్మరణం
Four Members Died in Medak Road Accident (ETV Bharat)
Published : Nov 2, 2024, 7:58 PM IST
|Updated : Nov 2, 2024, 9:05 PM IST
ఈ ప్రమాదంలో ఆంజనేయులు (50), ఆయన మరదలు లత(35) , ఆమె ఇద్దరు పిల్లలు సహస్ర(10), శాన్వి(6) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో మృతదేహాలను తూప్రాన్ ఆసుపత్రికి తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకొని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Last Updated : Nov 2, 2024, 9:05 PM IST