Massive Theft in Anantapur Medical College Hostel :అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వసతి గృహంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున హాస్టల్‌లోకి ప్రవేశించి విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వరకు విద్యార్థులు చదువుకుంటూ తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయాన్ని గుర్తించిన దుండగులు ఏకంగా వసతి గృహంలోకి ప్రవేశించి ఎవరికీ అనుమానం రాకుండా 20 లక్షల విలువైన లాప్‌టాప్‌లు, ఫోన్లు దోచుకెళ్లారు. నిత్యం సీసీటీవీ (CCTV) ల పర్యవేక్షణలో ఉన్న హాస్టల్‌లో దొంగతనం జరగడం అందర్ని విస్మయానికి గురి చేస్తోంది. తెలిసిన వారే చోరీకి పాల్పడినట్లు కొందరు అనుమానిస్తున్నారు. అయితే చోరీపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు చెబుతున్నారు.
Rs 20 Lakh Worth Laptops Mobiles Phones Theft :అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది నిత్యం సీసీ టీవీల పర్యవేక్షణ ఉండి, నగరం నడిబొడ్డున ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో చోరీ జరగడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది. వీటిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ప్రధాన సూత్రధారులు వసతి గృహం గురించి తెలిసిన వారే అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని పోలీసులు చెబుతున్నారు.