ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బైక్ ఇంజన్​లో బురద- వరద కథల్లో ఇదో వ్యథ - Massive Damage to Two Wheelers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2024, 11:34 AM IST

Massive Damage to Two Wheeler Vehicles Due to Floods  in Vijayawada: విజయవాడలో వరద దెబ్బకు మోటార్​ బైక్​లు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి. ద్విచక్రవాహనాలు మూడు రోజులపాటు పూర్తిగా నీటిలో ఉండటంతో ఎక్కడికక్కడ మొరాయించాయి. ప్రస్తుతం వరద తగ్గడంతో రిపేర్ల కోసం మెకానిక్‌ షెడ్డుల వద్దకు బైకులు క్యూకట్టాయి.

Massive Damage to Two Wheeler Vehicles Due to Floods  in Vijayawada
Massive Damage to Two Wheeler Vehicles Due to Floods  in Vijayawada (ETV Bharat)

Massive Damage to Two Wheeler Vehicles Due to Floods in Vijayawada :విజయవాడలో వరదలు సృష్టించిన నష్టం అంతా ఇంతా కాదు. ఆఖరికి ఇంటి ముందు పార్కు చేసిన మోటారు సైకిళ్లు సైతం భారీసంఖ్యలో దెబ్బతిన్నాయి. పీకల్లోతు నీరు ముంచెత్తడంతో మోటారు వాహనాలు మునిగిపోయి దెబ్బతిన్నాయి. ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు. చేసేదేెంలేక వాహనాలతో మెకానిక్​ షెడ్లకు చేరుకున్నారు జనాలు.

'ఇప్పుడిప్పుడే వరద ముంపు నుంచి మెల్లగా కోలుకుంటున్న తరుణంలో వాహనాలను మెకానిక్ షెడ్డులకు తరలిస్తున్నారు. వాహనాల్లోని కీలక పార్టులు దెబ్బతిన్నాయి. వరదనీరు చేరడంతో ఎయిర్ ఫిల్టర్, సైలెన్సర్, ఇంజన్లు పాడవుతున్నాయి. కొన్ని బాగు చెయ్యటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఒకే సారి చాలా మంది రావడంతో పని ఆలస్యమవుతుంది.' -మెకానిక్‌లు

చేతినిండా పనితో మెకానిక్కులు బిజీబిజీగా మారిపోయారు. వీలుకాక కొన్ని వాహనాలను చేయడం కుదరదని పంపేస్తున్నారు. సైలెన్సర్ తక్కువ ఎత్తులో ఉండే స్కూటీలు వంటివి ఎక్కువగా వరదల్లో దెబ్బతిన్నాయని మెకానిక్కులు చెబుతున్నారు. రోజుకు 20 నుంచి 30 బైకుల వరకు మెకానిక్కు షెడ్డులకు వస్తున్నాయని మెకానిక్‌లు చెబుతున్నారు.

శాంతించిన కృష్ణమ్మ - అయినా ముంపులోనే లంకగ్రామాలు, వేలాది ఎకరాలు - KRISHNA River Flood Flow Decrease

ఇప్పటికే వరద ధాటికి ఇంట్లో విలువైన సామగ్రి పాడైంది. దెబ్బ మీద దెబ్బలా మోటారు వాహనాలు సైతం దెబ్బతినడంతో యజమానులు విలవిల్లాడుతున్నారు. ఓవైపు ఆస్తినష్టం చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో ఈ అదనపు భారం మోయలేనిదిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విజయవాడ వాసులు. ఒక్కో బైక్‌కు కనీసం వెయ్యి నుంచి 3వేల రూపాయల వరకు ఖర్చవుతుందని వాపోతున్నారు. విధిలేక తప్పనిసరిగా పార్టులు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలు, వర్షాలు తగ్గేవరకు ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్న వారు మోటరు బైకులు తీసుకుని షెడ్డుకు వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మోయలేని భారమైనప్పటికీ తప్పదని వాహన యజమానులు నిట్టూరుస్తున్నారు.

వరద ఉద్ధృతి నుంచి కోలుకుంటున్న విజయవాడ - పునరావాసాలు వీడి ఆవాసాలవైపు కదులుతున్న బాధితులు - Relief operations in Vijayawada

'నా బండి షైన్​, నీటిలో మునిగిపోయింది, సైలెన్లపైదాక నీళ్లువచ్చి మోత్తం లోపలికి పోయాయి. మెకానిక్​ దగ్గరికి తీసుకొస్తే వాటర్​ తీసేశారు.పెట్రోల్​ట్యాంక్​లో మొత్తం బురద చేరింది. నా స్కూటీనే కాదు మా అపార్టమెంట్​లో చాలా వాహనాల పరిస్థితి ఇలాగే ఉంది.' వాహన యజమానులు

ABOUT THE AUTHOR

...view details