Married Woman Tries to Kidnap her Boy Friend :3 నెలలుగా వారిద్దరి మధ్య అసలు మాటలు లేవు. ఇష్టపడినవాడు ఏమో దూరం పెడుతున్నాడు. చేజారిపోతాడు ఏమో అన్న భయం, మరోవైపు వాటికి ఎలాగైనా ముగింపు పలకాలని నిశ్చయించుకుని ఓ మహిళ తన ప్రియుడిని ఏకంగా అపహరించేందుకు ప్రయత్నం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసుల ఆమె వెంబడించి వారి ఆటకట్టించారు. సినీ ఫక్కీలో జరిగిన ఘటన పూర్వాపరాలను తిరుపతి పడమర సీఐ రామకృష్ణ మీడియాకు వివరించారు.
వీరద్దరి మధ్య విభేదాలు, గొడవలు :సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, చిత్తూరు జిల్లా పెనుమూరు సమీపంలోని రేణుకా నగర్‌కు చెందిన శ్రీనివాసులు (31) తిరుపతిలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్థానిక పెద్దకాపు వీధిలోని పార్థ డెంటల్ ఆసుపత్రి ఎదురుగా లాడ్జిని సైతం నిర్వహిస్తున్నారు. అతనికి పెళ్లి కాలేదు. అవివాహితుడైన శ్రీనివాసులుకి మదనపల్లెకి చెందిన వివాహం అయిన సోనియా భానుతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త మృతి చెందాడు. శ్రీనివాసులు, సోనియా భానుల పరిచయం కాస్తా ప్రేమగా మారిది. ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకునే వరకు వచ్చింది. 3 నెలలుగా వీరద్దరి మధ్య విభేదాలు, గొడవలు వచ్చాయి. దీంతో ఇద్దరూ మాట్లాడుకోకపోవడంతో దూరమయ్యారు.