Womens Day Celebrations in Hyderabad : మహిళలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదని, అన్ని రంగాల్లో మహిళల సాధికారత మరింత పెరగాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్(Margadarsi MD Sailaja Kiron) పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్(FTCCI) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో శైలజా కిరణ్ పాల్గొన్నారు.
Sailaja Kiron on Women Empowerment : ఈ సందర్భంగా మాట్లాడిన శైలజా కిరణ్, మహిళలు ఇంటికే పరిమితం కాకుండా, తమకు అభిరుచి ఉన్న రంగాల్లో అడుగేయాలని శైలజా కిరణ్ పేర్కొన్నారు. తన దృష్టిలో గృహిణి బాధ్యత అంటే చాలా సవాల్‌తో కూడుకున్నదని తెలిపారు. ఓవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఇంటిపనులు నిర్వహిస్తూ విరామం లేకుండా శ్రమిస్తారని పేర్కొన్నారు. గృహిణి బాధ్యతను నిర్వహించాలంటే చాలా ఓపిక అవసరమని, అంతలా శ్రమించినప్పటికీ తగిన గుర్తింపు రావడం లేదన్నారు.
మార్గదర్శిని 10వేల కోట్ల రూపాయల టర్నోవర్‌కి తీసుకువచ్చేందుకు చేసిన కృషి గురించి పంచుకున్నారు. రోజు 14 గంటలు పని చేస్తానని పేర్కొన్న శైలజా కిరణ్, తన ప్రయాణంలో భర్త, అత్తమామల సహకారం మరువలేనిదన్నారు. చిట్ ఫండ్ చట్టాలకు లోబడే మార్గదర్శి నిర్వహిస్తునట్టు పేర్కొన్నారు. అయితే మీడియా సంస్థ నిర్వహిస్తూ, ప్రజల పక్షాన నిలబడిన కారణంగా మార్గదర్శి రెండు సార్లు రాజకీయ పగను చవి చూసిందని అభిప్రాయపడ్డారు.