తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్తీ కుంకుమతో ఎన్ని సమస్యలో - గుర్తించకుంటే ప్రాణానికే ప్రమాదం సుమా!

కుంకుమ సౌభాగ్యానికి చిహ్నం - కొందరు దీన్ని నుదుటన పెట్టుకుంటే, మరికొందరు పాపిట్లో దిద్దుకుంటారు. అయితే ఈ రోజుల్లో కుంకుమ వాడే కొంతమందిలో పలు రకాల చర్మ సమస్యలు తలెత్తడం ఆందోళనకరం..

Skin Problems with Adulterated Saffron
Skin Problems with Adulterated Saffron (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2024, 6:24 AM IST

Skin Problems with Adulterated Saffron :సింధూరం సౌభాగ్యానికి చిహ్నం. ఈ క్రమంలో పెళ్లైన మహిళలు కుంకుమ వాడడం సాధారణమే! కొందరు దీన్ని నుదుటన పెట్టుకుంటే, మరికొంతమంది పాపిట్లో దిద్దుకుంటారు. అయితే ఈ రోజుల్లో కుంకుమ వాడే కొంతమందిలో పలు రకాల చర్మ సమస్యలు తలెత్తడం చూస్తున్నాం. ఇందుకు వీటి తయారీలో వాడే హానికారక కెమికల్స్ కారణమంటున్నారు నిపుణులు. అందుకే కొనే ముందే కుంకుమ క్వాలిటీని పరిశీలించడం తప్పనిసరి అంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి ఈ స్టోరీలో..

ప్రస్తుత కాలంలో మార్కెట్లో కల్తీ కాని వస్తువు లేదంటే అతిశయోక్తి కాదు. సహజసిద్ధంగా పండే పంటలు మొదలుకొని తినే ఆహార పదార్థాల్నీ కల్తీ చేసేస్తున్నారు కొందరు. అంతేకాదు.. ఈ కల్తీ వల్ల బ్యూటీ ప్రొడక్ట్స్ తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. వీటిలో సింధూరం కూడా ఒకటి.

ఎలాంటి సమస్యలొస్తాయ్?

సహజంగా తయారుచేసిన కుంకుమ ముదురు ఎరుపు కలర్​లో ఉంటుంది.. లేదంటే కాస్త ఆరెంజ్‌ షేడ్‌లో లభిస్తుంది. అయితే కొంతమంది వీటికి ఆర్టిఫిషియల్ కలర్స్, మెరిసేలా చేయడానికి లెడ్‌-మెర్క్యురీ వంటి రసాయనాలు కలుపుతున్నారు. ఇలాంటి కల్తీ కుంకుమ వాడడం వల్ల చాలామందిలో స్కిన్​ సంబంధిత అలర్జీలు, ర్యాషెస్‌, దురద, ఆ ప్రదేశంలో చర్మం ఎరుపెక్కడం.. వంటి పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో ఆ చర్మ భాగం బ్లాక్​గానూ మారుతుంటుంది. అయితే ఇలాంటి రసాయన పూరిత కుంకుమను వాడటం వల్ల చర్మానికే కాదు.. ఆరోగ్యానికీ హానికరమే అంటున్నారు నిపుణులు. ఇలాంటి కుంకుమను దీర్ఘకాలం పాటు వాడితే.. వీటి తయారీలో వాడిన హానికారక లోహాలు.. బ్రీతింగ్​కు సంబంధించిన పలు సమస్యలకు దారితీయడంతో పాటు నాడీ, మూత్రపిండాలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థల పైనా ప్రతికూల ప్రభావం చూపుతాయట! ఫలితంగా ఆయా అవయవాలకు సంబంధిత సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.

ఇలా గుర్తించచ్చు!

అటు హెల్త్​పరంగా, ఇటు బ్యూటీ పరంగా ఆయా సమస్యలు రాకుండా నివారించుకోవాలంటే.. కొనే ముందే కుంకుమలోని కల్తీని కనిపెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించడం మేలు చేస్తాయంటున్నారు.

  1. ✷ కుంకుమ నేచురల్ కలర్ కాకుండా గులాబీ, కాషాయం, మరీ ముదురుగా.. ఇలా విభిన్న రంగుల్లో దొరుకుతుంది. ఇలాంటి కుంకుమ కృత్రిమ రంగులు వాడి తయారుచేసిందే అని గుర్తించాలంటున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి కలర్స్​లో ఉన్న కుంకుమ కొనకపోవడమే మంచిదంటున్నారు.
  2. ✷ సహజసిద్ధంగా సిద్ధంచేసిన కుంకుమ రంగు చేతికి అంటుకోదు.. అదే అంటుకుందని గుర్తిస్తే మాత్రం.. అందులో కృత్రిమ రంగులు, హానికారక డైలు యాడ్ చేసినట్లుగా పరిగణించాలి.
  3. ✷ కొన్ని కుంకుమలు చూడ్డానికి సాధారణ పౌడర్​లా కాకుండా.. ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తాయి. హానికారక డైలు, కెమికల్స్ కలపడం వల్లే వీటికి ఈ గ్లాసీ లుక్‌ వస్తుందట! అందుకే వీటినీ సైడ్ చేయాలని అంటున్నారు. అలాగే సాధారణ కుంకుమకే మెరుపులు కలిపిన సింధూరం కూడా బయట మార్కెట్లో దొరుకుతుంది. అదీ వద్దంటున్నారు నిపుణులు.
  4. ✷ సహజసిద్ధంగా తయారుచేసిన కుంకుమ ఘాటైన వాసనను కలిగి ఉండదట! ఒక రకమైన ఆహ్లాదకరమైన స్మెల్​ను కలిగి ఉంటుంది. అలా కాకుండా రసాయనాలు కలిపినట్లుగా గాఢమైన స్మెల్ వచ్చినా, ఒక రకమైన లోహపు వాసన వచ్చినా.. దీన్ని కల్తీ కుంకుమగా పరిగణించచ్చంటున్నారు నిపుణులు.
  5. ✷ నీటి పరీక్ష ద్వారా కూడా కల్తీ కుంకుమను గుర్తించవచ్చట! ఈ క్రమంలో ఒక గ్లాసు నీటిలో కొద్దిగా కుంకుమ వేసి మిక్సింగ్ చేయాలి. అసలు కుంకుమ అయితే అది నీటిలో కంప్లీట్​గా కరిగిపోతుంది. అదే నకిలీదైతే.. నీళ్లు ఆయా రంగుల్లోకి మారి.. పదార్థపు అవశేషాలు దిగువకు చేరతాయంటున్నారు నిపుణులు.
  6. ✷ మనం కొనే చాలా వస్తువులపై లేబుల్‌ని పరిశీలిస్తాం.. కానీ కుంకుమ ప్యాకెట్‌/బాక్స్‌పై ఉన్న లేబుల్‌ని పరిశీలించే వారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. కానీ అటువంటి నిర్లక్ష్యం తగదంటున్నారు నిపుణులు. ఈ ప్రొడక్ట్ తయారీలో ఏమేం వాడారో చెక్‌ చేసుకున్నాకే కొనమంటున్నారు. అలాగే సరైన సర్టిఫికేషన్‌ ఉన్న బ్రాండెడ్ కుంకుమను కొనడం, ఆ లేబుల్‌నీ పూర్తిగా పరిశీలించడం మంచిది.

కొరియన్​ మహిళల బ్యూటీ సీక్రెట్​ ఇదే - అందానికి ఆ అలవాట్లే అతి ముఖ్యం - Korean Beauty Skin Secrets

నిద్ర గురించి ఈ అపోహలు మీలోనూ ఉన్నాయా? - నిపుణులు చెబుతున్నదేమిటంటే..?

ABOUT THE AUTHOR

...view details