Manchu Mohan Babu Emotional Audio Message:రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని తన నివాసంలో మంగళవారం జరిగిన ఘటనపై మోహన్ బాబు స్పందించారు. కొన్ని కారణాల వల్ల తాను, తన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఘర్షణ పడ్డామని, ప్రతి ఫ్యామిలీలోనూ ఇలాంటివి ఉంటాయన్నారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ఆడియో సందేశం పంపించారు.
'నిన్ను గారాబంగా పెంచానని, ఏది అడిగినా ఇస్తే.. ఇప్పుడు గుండెల మీద తన్నావ్, నా మనసు ఆవేదనతో కుంగిపోతోంది, ఈ ఘర్షణ వల్ల మీ అమ్మ ఆస్పత్రిలో చేరింది. నీకు జీవితంలో అన్నీ ఇస్తే నాకు అపకీర్తి తీసుకొచ్చావ్, నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదు, నా పరువు, ప్రఖ్యాతలు మంటగలిపావు, నీకు జన్మనివ్వడమేనా నేను చేసిన పాపమా?, నా ఆస్తులను ముగ్గురికి సమానంగా రాయాలా, లేదా అనేది నా ఇష్టం' - ఆడియో సందేశంలో మోహన్ బాబు ఆవేదన