ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"నేను ఇంటికి వెళ్లడానికి అదొక్కటే కారణం - నా భార్య తల్లిదండ్రులు ఉండుంటే ఊరుకునేవారా?" - MANCHU MANOJ ON FAMILY ISSUE

ఆస్తుల కోసం మా నాన్నతో గొడవపడుతున్నాననేది వాస్తవం కాదన్న మనోజ్‌

Manchu Manoj on Family Issue
Manchu Manoj on Family Issue (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2024, 1:51 PM IST

Updated : Dec 11, 2024, 2:47 PM IST

Manchu Manoj on Family Issue : మంచు మోహన్​బాబు కుటుంబం వివాదం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మీడియా మిత్రులకు తన తండ్రి మోహన్‌బాబు, అన్న విష్ణు తరఫున క్షమాపణ చెబుతున్నట్లు మంచు మనోజ్ పేర్కొన్నారు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని చెప్పారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడూ తోడుంటానని తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

Manchu Manoj Key Comments :నాకోసం వచ్చిన మీకు (జర్నలిస్టులు) ఇలా జరగడం బాధగా ఉందని మనోజ్ వివరించారు. మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. తన కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదని ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదని చెప్పారు. సొంతకాళ్లపై పనిచేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ వివాదంలోకి నా భార్య, ఏడు నెలల కుమార్తెను లాగుతున్నారని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

'నా భార్య వాళ్లింట్లోనూ ఏమీ అడగలేదు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాం. ఆస్తి కోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మా నాన్న దేవుడు కానీ ఈరోజు చూస్తున్నది మా నాన్నను కాదు. ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతాను. నేను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తా' అని మనోజ్‌ వివరించారు.

కొంతమంది బంధువులు, నాన్న సన్నిహితుల సూచనతో ఈ ఇంటికి వచ్చానని మనోజ్ పేర్కొన్నారు. 'ఎన్నో సంవత్సరాలుగా బయట ఉంటున్నావు. ఇంట్లో అమ్మానాన్న మాత్రమే ఉన్నారు. మీ అన్న ఫ్యామిలీతో దుబాయ్‌కు షిఫ్ట్‌ అయ్యాడు. నీ భార్య గర్భవతిగా ఉంది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఈ సమయంలో నీ భార్యకు మీ తల్లి, పెద్దవాళ్ల అవసరముంది. ఒక్కడివే ఎలా చూసుకుంటావు?’ అని వారు తనతో అన్నట్లు తెలిపారు. తన భార్య కూడా వారిని సమర్థించి వారి మాట వినాలని కోరడంతో ఈ ఇంటికి తిరిగి వచ్చానని మనోజ్ వివరించారు.

‘‘నాపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. దీనికి నేనేమీ చెప్పలేను. ఆధారాలు మాత్రమే చూపించగలను. నేనెప్పటినుంచో కూర్చొని మాట్లాడదామన్నాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకున్నాను. ఆమె కోసం పోరాడాను. అందులో తప్పేముంది? పది మంది కోసం నిలబడినందుకు నేను చెడ్డవాడిని అయ్యాను. ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేశాను. రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను. గొడ్డులా కష్టపడ్డాను. మనస్ఫూర్తిగా, సంతోషంగా చేశాను. ఏ రోజూ ఒక్క రూపాయి అడిగింది లేదు ఆశించింది లేదు." - మంచు మనోజ్

మధ్యలో మా అమ్మ నలిగిపోతోంది :ఇప్పుడు తనకు భార్యాపిల్లలు ఉన్నారని మనోజ్ పేర్కొన్నారు. ఈరోజు తాను నిలబడకపోతే రేపు పిల్లలు పెద్దవాళ్లయ్యాక వాళ్లకి సమాధానం చెప్పుకోలేనని చెప్పారు. దొంగతనం చేసి వేరే వాళ్ల పొట్టకొట్టి పిల్లల మొహం చూడలేను ఆ కూడు వారికి పెట్టలేనని తెలిపారు. మా అమ్మానాన్నలు తనను అలా పెంచలేదని వివరించారు. ఈ వివాదంతో మధ్యలో మా అమ్మ నలిగిపోతోందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Manchu Family Controversy Updates :భార్య వచ్చాక ఇలా అయ్యానని ఆరోపిస్తున్నారని.. ఆమె తల్లిదండ్రులు ఉండుంటే ఊరుకునేవారా? అని మనోజ్ ప్రశ్నించారు. ఇవాళ తన భార్యకు తల్లి, తండ్రి అన్నీ తానేనని వ్యాఖ్యానించారు. ఇవాళ సైలెంట్‌గా ఉంటే ఎలా? ఇన్నాళ్లూ ఆగాను, ఇక ఆగలేనన్నారు. సాయంత్రం ప్రెస్‌మీట్‌లో ఆధారాలన్నీ బయటపెడతానని మనోజ్‌ వెల్లడించారు.

'నా పరువు, ప్రఖ్యాతలు మంటగలిపావు మనోజ్​' - మోహన్​బాబు ఆడియో

మంచు కుటుంబంలో రచ్చ రచ్చ - అర్ధరాత్రి వారిని ట్యాగ్ చేస్తూ మనోజ్ ట్వీట్

Last Updated : Dec 11, 2024, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details