Man Stealing Shoes At Midnight in Hyderabad :దొంగలు పలు రకాలుగా ఉంటారు. కొందరు నగలు, బైకులు, డబ్బులు ఎత్తుకెళ్లే వారు ఉంటారు. వీరి నుంచి తమను తాము రక్షించుకోవడానికి, అలాగే విలువైన వస్తువులను కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఓ దొంగ మాత్రం విలువైన వస్తువుల జోలికి పోకుండా ఇంటి బయట ఉన్న బూట్లపై కన్నేశాడు. వారం తరువాత రోజులు స్థానికులు ఆ దొంగను పట్టుకుని పోలీసులుకు అప్పగించారు.
ఇళ్లలో బూట్లు మాయం :నగలు, బైకులు, డబ్బులు ఎత్తుకెళ్లే దొంగలను చూశాం, కానీ హైదరాబాద్‌లోని రామంతాపూర్ డివిజన్ శ్రీరామకాలనీలో ఓ దొంగ రోజూ అర్ధరాత్రి తిరుగుతూ ఇళ్ల బయట ఉన్న బూట్లను దొంగిలిస్తున్నాడు. ఏడు రోజుల నుంచి కాలనీలోని పలువురి ఇళ్లలో బూట్లు మాయమైపోతున్నాయి. ఇది గమనించిన స్థానిక ప్రజలు అయోమయానికి గురయ్యారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. దీంతో అసలు బండారం బయటపడింది.
రూ.10 లక్షల విలువ.. 200 బూట్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. అన్నీ 'కుడి కాలివే'నట!
కుప్పలు కుప్పలుగా కనిపించిన బూట్లు :అర్ధరాత్రి వేళ ఓ వ్యక్తి ఓ ఇంటి గేటు లోపలికి వచ్చి బూట్లను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సదరు వ్యక్తిని గమనించిన స్థానిక ప్రజలు అతను పక్కనే ఉండే వాసవీనగర్ కాలనీలో ఉంటాడని తెలుసుకున్నారు. 3 రోజుల పాటు నిందితుడి కదలికలపై నిఘా ఉంచారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం వలపన్ని అతన్ని పట్టుకున్నారు. దొంగ ఇంటికి వెళ్లి సోదా చేయగా కుప్పలు కుప్పలుగా బూట్లు కనిపించాయి. అది చూసి అంతా అవాక్కయ్యారు. బూట్లు మాత్రమే ఎందుకు చోరీ చేశావని వారు ప్రశ్నించగా అతని నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో నిందితుడితో పాటు అతని భార్యను ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా నిందితుడి భార్య ఇటీవల పూటుగా మద్యం తాగి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేయడం వైరల్ అయ్యింది.
కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇస్తారు - ఆపై దొరికినంతా దోచేస్తారు