తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక్క ఛాన్స్​ ఇస్తానంటూ రూమ్​కు పిలిచి - ఫొటో షూట్​ పేరుతో లైంగిక దాడి - SEXUAL ASSAULT CASE IN HYDERABAD

సినిమా అవకాశాల పేరుతో మహిళపై లైంగిక దాడి - జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు - కేసు నమోదు

Sexual Assault Case
Sexual Assault Case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2025, 12:35 PM IST

Sexual Assault Case : సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళను నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన ఒకరిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి మణికొండలో హౌస్‌ కీపింగ్‌ పని చేస్తూ జీవనం సాగిస్తోంది.

ఆమె 15 రోజుల క్రితం అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో చేరింది. సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కృష్ణానగర్‌ ప్రాంతంలో తెలిసిన వారిని వాకబు చేస్తున్న క్రమంలో డైరెక్షన్‌ విభాగంలో పని చేస్తున్న కాటేకొండ రాజుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఆడిషన్స్‌ ఉన్నాయంటూ ఆమెను కృష్ణానగర్‌లోని ఓ హోటల్‌కు పిలిపించాడు. మొదటి రోజు ఫొటో షూట్‌ చేసి మరుసటి రోజు రావాలని చెప్పి పంపించాడు.

రెండో రోజు వెళ్లగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయంపై బాధితురాలు శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నగ్న పూజలకు సహకరిస్తే డబ్బులిస్తాం : విద్యార్థినికి వంట మనిషి వేధింపులు

వాష్​రూమ్​ నుంచి వస్తుండగా వెనుక నుంచి హగ్​- వేధింపులు మితిమీరాయ్​!: మాలీవుడ్ నటి - Sexual Assault Allegations Case

ABOUT THE AUTHOR

...view details