వైరల్ వీడియో : బైక్‌పై ట్రైన్‌కు ఎదురుగా దూసుకెళ్లిన వ్యక్తి - తర్వాత ఏమైందంటే? - MAN RIDING BIKE IN FRONT OF TRAIN
రైలుకు ఎదురుగా బైక్‌పై దూసుకెళ్లిన వ్యక్తి - సమయస్ఫూర్తి చూపిన గేట్‌కీపర్ - నిజామాబాద్ జిల్లాలో ఘటన
Published : Dec 5, 2024, 11:13 AM IST
|Updated : Dec 5, 2024, 12:01 PM IST
Man Riding Bike In Front Of Train In Nizamabad : ఓ వ్యక్తి తిరుపతి వెళ్తున్న రైలుకు ఎదురుగా ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దర్యపూర్ రైల్వే గేట్ వద్ద చోటు చేసుకుంది. గేట్ కీపర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలు సిబ్బందికి సమాచారం అందించడంతో రైలును ఆపారు. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణాలు దక్కాయి. ఈ బైక్‌ను నడిపిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో అరగంట పాటు రైలును అక్కడే ఆపేశారు.