తెలంగాణ

telangana

ETV Bharat / state

దారుణం - భార్య, కుమారుడిని హతమార్చి ఆత్మహత్య చేసుకున్న సిరాజ్​ - HUSBAND KILLED WIFE AND SON

భార్య, కుమారుడిని హత్య చేసిన భర్త - అనంతరం ఉరివేసుకుని నిందితుడు సిరాజ్‌ ఆత్మహత్య

HUSBAND KILLED WIFE AND SON
Man commited suicide after Killed wife and Son (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2024, 8:37 AM IST

Updated : Dec 13, 2024, 11:29 AM IST

Man commited suicide after Killed wife and Son : హైదరాబాద్​లో బేగంబజార్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య, కుమారుడిని హత్యచేసి అనంతరం భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య గొంతు కోసి చంపిన భర్త సిరాజ్‌, కుమారుడి గొంతు నులిమి హతమార్చాడు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్​ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్​కు చెందిన సిరాజ్(41) ఆరేళ్లుగా బేగంబజార్​లోని ఓ బ్యాంగిల్ స్టోర్​లో పని చేస్తున్నాడు. సిరాజ్​కు భార్య హేలియా (35), ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యపై అనుమానంతో గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది.

ఈ నేపథ్యంలో భార్య గొంతు కోసి చంపిన సిరాజ్‌, చిన్న కుమారుడిని గొంతు నులిమి పాశవికంగా కడతేర్చాడు. అనంతరం అతను ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తనను క్షమించాలని హిందీలో సూసైడ్ నోట్​ రాసి తన తల్లిదండ్రులను కోరాడు. తమ మృతదేహాలను స్వస్థలానికి పంపించాలని సూసైడ్ నోట్​లో పేర్కొన్నాడు. ఉదయం 4 గంటల సమయంలో నిద్రలేచిన సిరాజ్​ పెద్ద కుమారుడు, రక్తం మడుగులో ఉన్న తల్లిని గుర్తించి భవనంలో నివాసమున్న వ్యక్తులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

నెలరోజుల క్రితమే నగరానికి వచ్చిన సిరాజ్ కుటుంబం : నెలరోజుల క్రితమే సిరాజ్ తన కుటుంబాన్ని ఉత్తర్​ప్రదేశ్ ​నుంచి ఇక్కడి తీసుకువచ్చాడు. అతని స్వస్థలం ఉత్తరప్రదేశ్​లోని ఫజియాబాద్. కాగా ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఉదయం నాలుగున్నర గంటలకు డయల్​ 100 ద్వారా సమాచారం వచ్చిందని తెలిపారు.

'పోలీసులు సరిగ్గా స్పందించలేదు అందుకే నేనే చంపేశా - ఆడపిల్ల తండ్రిగా నేను చేసింది న్యాయమే'

అప్పుల బాధతో పురుగులమందు తాగిన కుటుంబం - ముగ్గురు మృతి

Last Updated : Dec 13, 2024, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details