తెలంగాణ

telangana

ETV Bharat / state

నగదు వివాదంపై భార్యను గొడ్డలితో హతమార్చిన భర్త - husband killed his wife

Man killed his wife at Nagarkurnool : భార్యాభర్తలకు డబ్బుల విషయంలో వివాదం చోటుచేసుకోగా భర్త తన భార్యను దారుణంగా గొడ్డలితో హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తన కుమార్తె ఇంటికి వెళ్లాడు నిందితుడు. ఈ ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో జరిగింది.

Man Killed Wife With Electrocution
Man killed his wife at Nagarkurnool

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 7:33 PM IST

Man killed his wife at Nagarkurnool : కట్టుకున్న భర్తే కాలయముడై కాటేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో శ్రీనివాస్‌, ఇందిర అద్దె ఇంట్లో నివసిస్తుండగా, నెల రోజులుగా వీరి మధ్య డబ్బు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. భార్య దగ్గర ఉన్న డబ్బులు భర్త జల్సాల కోసం వాడుకుంటున్నాడని ఆమె తన భర్తను మందలించింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త తన భార్యను గొడ్డలితో హతమార్చాడు. శవాన్ని ఇంట్లో పెట్టి కుమార్తె ఇంటికి వెళ్లగా, తల్లి గురించి కుమార్తె నిజం తెలుసుకోవడంతో అక్కడి నుంచి పరారైయ్యాడు. కుమార్తె అఖిల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా శ్రీనివాస్‌ని కల్వకుర్తిలో పట్టుకొని విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

'నా డబ్బులు వాడుకుంటున్నాడని మా అమ్మ, నాన్నను అడిగేసరికి మా అమ్మను గొడ్డలితో చంపేశాడు. నాలుగు రోజుల క్రితం చంపి నిన్న నా దగ్గరికి వచ్చాడు. మళ్లీ నేను ఇంటికి తీసుకొచ్చేసరికి పరారైయ్యాడు. మా అమ్మ అప్పటికే చనిపోయింది. నాలుగు రోజులు నుంచి ఇంట్లోనే పెట్టి తాళం వేశాడు'- అఖిల, మృతురాలి కుమార్తె

'మృతురాలి ఇందిరకు మొదట సుధాకర్​రెడ్డితో వివాహం అయింది. వీరికి ఓ కుమార్తె ఉంది. తర్వాత ఇందిర సుధాకర్​రెడ్డితో విడాకులు తీసుకుని, తర్వాత ఒక 5 సంవత్సరాలకు శ్రీనివాస్​ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి కూడా ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు అఖిల. ఆమెకు 2022లో పెళ్లి అయింది. కుమార్తె నగదు శ్రీనివాస్​ వాడుకుంటున్నాడని తన భర్తతో ఇందిరకు తరుచుగా గొడవలు అవుతున్నాయి. ఈ విషయంలోనే గొడవ పడుతూ శ్రీనివాస్​ ఇందిరను పదునైన ఆయుధంతో తల మీద కొట్టగా ఆమె అక్కడికక్కడికే చనిపోయింది'- కనకయ్య, సీఐ

Man Killed Wife With Electrocution :ఇదికాగా మరోచోట కూడా ఫిబ్రవరి 10న ఓ వివాహిత హత్యకు గురైంది.భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన ఓ భర్త, ఆమెను కిరాతకంగా హతమార్చాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో నోట్లో కరెంట్ వైర్ పెట్టి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని హరిద్వార్(Haridwar) జిల్లాలో జరిగింది. ఈ వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

పట్టపగలే ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ప్రియుడు

మంత్రాల నెపంతో తల్లీ, కుమారుడి దారుణ హత్య - రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపిన మూఢనమ్మకం

ABOUT THE AUTHOR

...view details