Man Beaten to Death for Not Giving Money :అతనో పాత నేరస్థుడు. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. ఎదురుపడిన ప్రతి ఒక్కరిని డబ్బులు అడుగుతాడు. వేధింపులకు గురి చేస్తాడు. ఎవరైనా ఇవ్వకపోతే కోపానికి గురై వారిపై దాడి చేస్తాడు. ఇదే క్రమంలో సైకిల్‌పై వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్న వ్యక్తి తలపై కర్రతో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా రాజపేట మండలంలోని రఘునాథపురంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, మజ్జిగ యాదగిరి అనే వ్యక్తి మధ్యాహ్నం సైకిల్‌పై పొలం వద్దకు వెళ్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన పాత నేరస్థుడు వడ్లకొండ నాగరాజు అటువైపు వెళ్లాడు. ఇద్దరు ఎదురుపడ్డారు. అంతే యాదగిరిని నాగరాజు డబ్బులు అడిగాడు.
తన వద్ద లేవని యాదగిరి చెప్పాడు. దీంతో కోపానికి గురైన నాగరాజు కర్రతో తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో యాదగిరి అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి చేసి పారిపోతున్న నాగరాజును స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనిపై యాదగిరిగుట్ట ఏసీపీ రమేశ్‌కుమార్, సీఐ రమేశ్ సందర్శిచి గ్రామస్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీంను రప్పించి నిందితుడు వాడిన కర్రను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఒకరి ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో నాగరాజు జైలు శిక్ష అనుభవించి, క్షమాభిక్ష కారణంగా ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.
మృతదేహం వద్ద గుమిగూడిన గ్రామస్థులు (ETV Bharat) ఇదెక్కడి దారుణం సామీ - వడ్డీ డబ్బుల కోసం అన్నావదినలను కట్టేసిన తమ్ముడు - Brothers fight for interest money
స్థానికుల ఫిర్యాదులు :ఎదురుపడ్డ వారిని డబ్బులు అడుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లోనూ నాగరాజుపై ఫిర్యాదు చేశారు. పోలీసుల తాత్సారం కారణంగానే ఈ ఘటన జరిగిందని, ఈయన ఆగడాలను భరించలేకపోయామని ఆరోపించారు. స్థానిక ఎస్సై ఉపేందర్ యాదవ్ ఇక్కడికి వచ్చేంత వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించేది లేదని బంధువులు, గ్రామస్థులు పట్టుబట్టారు. ఓ దశలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
మృతుడు మజ్జిగ యాదగిరి (ETV Bharat) ఏసీపీ రమేశ్ కుమార్ జోక్యం చేసుకుని ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూస్తామని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పండంతో గ్రామస్థులు శాంతించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతదేహంతో నాగరాజు పినతండ్రి ఇంటి ముందు యాదగిరి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. ఏసీపీ జోక్యంతో గొడవ సద్దుమణిగింది. మృతుడు యాదగిరికి భార్యతో పాటు ఐదుగురు కుమార్తెలున్నారు. మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆలేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
నిందితుడు నాగరాజు (ETV Bharat) డబ్బుల కోసం బిడ్డను అమ్మేసింది - 20వేలు తక్కువ కావడంతో గొడవకు దిగింది
చెత్త కాగితాల దుకాణంలో పాఠ్యపుస్తకాలు- డబ్బుల కక్కుర్తితో అమ్మినట్లు ఆరోపణలు - Govt textbooks In Scrap shop