Five People Died in Road Accident Nellore :నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి మండలం గౌరవరం గ్రామ సమీపంలోని చెన్నై-కలకత్తా జాతీయ రహదారిపై బోగోలు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకవైపు నుంచి కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కావలి డివిజన్ పరిధిలోని జలదంచి మండలం చామదల గ్రామానికి చెందిన వారిగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.
పండుగ వేళ విషాదం- బస్సు లోయలో పడి 17మంది భక్తులు దుర్మరణం- 38మందికి గాయాలు
Road Accident In Nellore District :వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా జలదంచి మండలం చామాదుల హరిజనవాడకు చెందిన ఓ కుటుంబం విజయవాడ దగ్గరలోని ఇబ్రహీంపట్నంకి కారులో వెళ్తోంది. కావలి మండలం గౌరవరం గ్రామం సమీపం వచ్చే సరికి ఆగి ఉన్న లారీని వెనక వైపు నుంచి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఐదుగురు (Five persons Died) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో దావులూరి శ్రీనివాసులు (50), ఆయన భార్య వరమ్మ (45), కూతురు నీలిమ, వదిన లక్ష్మమ్మ (55), మనుమడు (10) ఉన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జుగా మారింది. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కావలి డీఎస్పీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.