Gold Loan Frauds in Khammam :నకిలీ బంగారం తాకట్టుపెట్టి ఓ ముఠా కోట్లు కొట్టేసిన వైనమిది. ఖమ్మం జిల్లాలోని పది రకాల బ్యాంకులకు చెందిన శాఖలను మోసగించినట్లు సమాచారం. వీటిలో ప్రముఖ బ్యాంకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం వారి బ్యాంకుల ఆధీనంలో ఉన్న ఆభరణాలను పరిశీలించే పనిలోపడ్డారు.
ఖమ్మంలోని కొన్ని గ్రామాలకు చెందిన వ్యక్తులు పథకం ప్రకారం బ్యాంకులను మోసగించినట్లు తెలిసింది. బంగారంలా కనిపించే రోల్డ్‌గోల్డ్ బ్రేస్‌లెట్లు తాకట్టుపెట్టి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఈ ముఠాకు చెందిన వ్యక్తుల ఆధార్, పాన్‌కార్డులను పరిశీలించినప్పుడు వెలుగులోకి వచ్చిన వివరాలతో బ్యాంకర్లు షాక్ అవుతున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఎలా మోసం చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఒక్కో బ్యాంకు శాఖలో నకిలీ బంగారు తాకట్టుపెట్టి రూ. 1-1.20 లక్షల వరకు రుణాలు తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు.
పరిశీలించిన తర్వాత కూడా మోసం :బ్యాంకులో ఏదైనా ఆభరణం తాకట్టుపెట్టినప్పుడు దాన్ని అప్రైజర్ పరిశీలించి బంగారం అని నిర్ధారించినప్పుడే మేనేజర్ లోన్ మంజూరు చేయాల్సి ఉంటుంది. స్థానిక అప్రైజర్లు, బ్యాంకు అధికారుల హస్తం ఇందులో ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఇతర అప్రైజర్లతో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను పరిశీలింపజేస్తున్నారు. చాలా బ్యాంకుల్లో బ్రేస్‌లెట్లపై బంగారం పూత లేకపోవడంతో భావించి బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రైవేటు ఫైనాన్స్ బ్యాంకులు సైతం తమ శాఖల్లో అంతర్గత తనిఖీలు చేపట్టాయి.
అర్జెంటుగా డబ్బులు అవసరమయ్యాయా? బెస్ట్ 'ఎమర్జెన్సీ లోన్' ఆప్షన్స్ ఇవే!