Main Reasons for Separation of Husband and Wife :కుటుంబంతో హాయిగా, ఆనందంగా ఉండాల్సిన బంధాన్ని కొందరు విడిచి పెడుతున్నారు. సర్దుకుపోయే గుణం లేకుండాపోతుంది. వివాహ బంధాలను వీడి, పిల్లల జీవితాలను ఆగం చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో తమ వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టుకుంటున్నారు. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పోయే సమస్యలకు సైతం పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు. వీరిలో యువ జంటలు సైతం ఉంటున్నాయి.
పోలీసులు ఏం గుర్తించారంటే?
- గృహ హింస నివారణ కేసులు రావడం
- ఇష్టా ఇష్టాలు తెలుసుకోకుండా తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేయడంతో నేటి తరం సర్దుకోలేక గొడవలు పడటం
- ఆర్థిక సమస్యల కారణంగా దంపతులు విడాకులు తీసుకోవడం
- ఉమ్మడి కుటుంబంలో జీవించేందుకు కొందరు మహిళలు సుముఖత చూపించకపోవడం
90 శాతం కేసుల్లో దంపతుల మధ్య మనస్పర్థలకు కారణం సెల్‌ఫోన్లు, అపోహలు, అహం, మద్యం అలవాటు, అక్రమ సంబంధాలని పోలీసులు వివరిస్తున్నారు.
Relationship tips : అర్థం చేసుకుంటేనే అనుబంధం పదిలం
అహం :ఇంట్లో నా మాటే చెల్లుబాటు కావాలి. నేను లేకపోతే ఇళ్లే నడవదు. నేను చేసిన వంటే అంతా తింటున్నారు. నా కష్టంతోనే కుటుంబం నడుస్తోంది. ఇలా ఎవరికి వారు అహం ప్రదర్శించి బంధుత్వాలను తెంచుకుంటున్నారు. 'సారీ' చెబితే అయిపోయే విషయాలను సైతం అహంతో పోలీసుల వరకు తెచ్చుకుంటున్నారు.
అపోహలు :అపోహలు ఇద్దరి మధ్యం ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. ఏదో ఊహించుకుని ఇంకేదో మనసులో పెట్టుకుని మాట్లాడటం, చేయి చేసుకోవడం వంటి కారణాలతో తగాదాలు వస్తున్నాయి. ఏదైనా ఉంటే అడిగి తెలుసుకోవాల్సింది పోయి, దెప్పి పొడవడం వల్ల గొడవలు జరుగుతున్నాయి.