MG University Students Protest Over Breakfast Issue In Hostel :అల్పాహారంలో కారం, ఉప్పు పెడుతున్నారని మహాత్మాగాంధీ యూనివర్సిటీ మహిళా విద్యార్థినులు హాస్టల్ సిబ్బందితో గొడవ పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంగళవారం ఉదయం అల్పాహార సమయంలో మెస్‌కు వచ్చిన విద్యార్థినులు బ్రేక్‌ఫాస్ట్ చూసి ఆందోళనకు దిగారు. పొద్దున్నే అన్నం, ఉప్పు, కారం పెట్టడం ఏంటని సిబ్బందితో గొడవకు దిగారు.
ఈ విషయంపై యూనివర్సిటీ అధికారులకు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు విద్యార్థినులు వాపోయారు. విద్యార్థినులు ఆందోళనకు దిగడంతో స్పందించిన అధికారులు హాస్టల్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థినుల భాగస్వామ్యంతోనే వారికి నచ్చిన మెనూ ప్రకారమే ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ ఉంటుందని వారు తెలిపారు.
మెస్ ఛార్జీలు పెంచినా మారని పరిస్థితి :ప్రభుత్వ వసతి గృహాల్లో ఇటీవల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో వారు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్నికాదు. సరిగ్గా ఆహారం వండకపోవడంతో వికటించి చాలా మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురవుతుండగా, మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజాగా మెస్‌ఛార్జీలను పెంచింది. తరచూ హాస్టల్స్‌కు వెళ్లి తనిఖీ చేస్తున్నారు అధికారులు.