Mahabubnagar MLC by Elections Polling Today 2024 :మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఉపఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. ఇద్దరు ఎంపీలు, 14 మంది శాసనసభ్యులు, ముగ్గురు MLCలు, 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు కలిపి మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు.
ఓటుహక్కు వినియోగించుకోనున్న 1439 మంది : వీరిలో 644 మంది పురుషులు, 795 మంది మహిళలున్నారు. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 245 మంది ఓటర్లు(Voters in Telangana 2024) అత్యల్పంగా కొడంగల్‌లో 56 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్‌లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఏడు దశల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు- జూన్ 4న కౌంటింగ్- పూర్తి షెడ్యూల్ ఇదే
Mahabubnagar MLC By Poll 2024 :వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రం లోపలికి ఒకేసారి ఎక్కువ మందిని అనుమతించకుండా నలుగురు ఓటర్లు చొప్పున మాత్రమే అనుమతిస్తున్నారు. బ్యాలెట్ విధానంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానిని చూపించిన తర్వాతే అధికారులు లోపలికి అనుమతి ఇస్తున్నారు.