ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హీరో నాగార్జునకు షాకిచ్చిన 'హైడ్రా' - ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేత - N Convention demolition by HYDRA

Nagarjuna N Convention Demolish: జీహెచ్​ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా పని చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా హీరో నాగార్జునకు చెందిన హైదరాబాద్​లోని మాదాపూర్​ ఎన్​ కన్వెన్షన్​ను హైడ్రా బృందం కూల్చి వేస్తోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి.

n convention Demolition
n convention Demolition (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 9:37 AM IST

Updated : Aug 24, 2024, 2:10 PM IST

Madhapur N Convention demolition by HYDRA: కబ్జాదారుల వెన్నులో హైడ్రా వణుకు పుట్టిస్తోంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇవాళ హైదరాబాద్​ మాదాపూర్​లోని ఎన్​ కన్వెన్షన్​ను హైడ్రా కూల్చేసింది. ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ కన్వెన్షన్​ దగ్గరకు చేరుకున్న హైడ్రా అధికారుల బృందం, కూల్చివేతలు ప్రారంభించింది. ఈ కన్వెన్షన్​ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందినదిగా తెలుస్తోంది.

అక్రమంగా నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వస్తున్న తుమ్మిడి చెరువు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు మూడున్నర ఎకరాల భూమిని నటుడు నాగార్జున కబ్జా చేసి కట్టడాలను నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం హైడ్రాకు ఫిర్యాదు అందడంతో నిర్మాణం చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు, పలు కోణాల్లో పరిశోధించి తదనుగుణంగా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.

ఎన్​ కన్వెన్షన్​ను కూల్చివేయాలని హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి లేఖ :ఎన్​ కన్వెన్షన్​పై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్​కు ఈ నెల 21వ తేదీన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. తుమ్మిడికుంట ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లో ఎన్​ కన్వెన్షన్​ ఆక్రమణలను హైడ్రాకు రాసిన లేఖలో మంత్రి కోమటిరెడ్డి వివరించారు. ఈ కన్వెన్షన్​కు సంబంధించిన శాటిలైట్​ ఫొటోలతో సహా ఆధారాలను హైడ్రాకు అందించారు. మంత్రి కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన తర్వాతే ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేతని హైడ్రా చేపట్టింది.

ఎన్​ కన్వెన్షన్​ను కూల్చివేయాలని హైడ్రాకు లేఖ (ETV Bharat)

తుమ్మిడికుంట ఎఫ్​టీఎల్​ మొత్తం విస్తీర్ణం 29.6 ఎకరాలు : తుమ్మిడి కుంట ఎఫ్​టీఎల్​ మొత్తం విస్తీర్ణం 29.6 ఎకరాలుగా ఉందని అధికారులు తెలిపారు. ఎఫ్​టీఎల్​ పరిధిలో 2014లో 2.39 ఎకరాల్లో 19 అక్రమ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. 2020లో 4.69 ఎకరాలు ఆక్రమణ జరగగా, ఈసారి 32 నిర్మాణాలు చేపట్టారన్నారు. అయితే తుమ్మిడికుంట బఫర్​ జోన్​ విస్తీర్ణం 10 ఎకరాలుగా ఉంది. 2014లో 2.05 ఎకరాల బఫర్​ జోన్​ ఆక్రమణ కాగా 23 నిర్మాణాలు చేపట్టారు. అదే 2020లో 5.02 ఎకరాల బఫర్​ జోన్​ ఆక్రమణ జరిగ్గా, 81 నిర్మాణాలు చేపట్టారని అధికారులు వివరించారు.

వణుకు పుట్టిస్తోన్న హైడ్రా: హైదరాబాద్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా (Hyderabad Disaster Management and Asset Protection Agency) తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం హైడ్రా ప్రధాన లక్ష్యాలు. అయితే ప్రస్తుతం ఇది కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. హైదరాబాద్​లో నిత్యం ఏదో ఒకచోట అధికారులు ఆక్రమణలను కూల్చేస్తున్నారు. తాజాగా సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది.

తప్పుడు సమాచారంతో చట్ట విరుద్ధంగా కూల్చివేశారు: నాగార్జున - Nagarjuna React on Demolish

Last Updated : Aug 24, 2024, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details