Nampalli Court Grant Bail to Bhanu Kiran : హైదరాబాద్‌లో సంచలనం రేపిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ప్రధాన నిందితుడు భాను కిరణ్ విడుదలయ్యారు. చంచల్‌గూడ జైలులోనే ఆయన సుమారు 12 ఏళ్ల పాటు ఉన్నాడు. సీఐడీ ఆమ్స్ ఆక్ట్ కేసులో భాను కిరణ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఈరోజు (నవంబర్ 06)న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.
సంచలనం రేపిన సూరి మర్డర్ : జనవరి 4, 2011న మద్దెల చెరువు సూరి, భాను కిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి ప్రధాన నిందితుడు. హైదరాబాద్లోని సనత్నగర్లో భానుకిరణ్ మద్దెల చెరువు సూరిని తుపాకీతో కాల్చి చంపేశాడు. అప్పట్లో ఈ మర్డర్ కేసు పెద్ద సంచలనం సృష్టించింది. అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాలలో పరిటాల రవి, మద్దెల చెరువు సూరి, మొద్దు శీను, భాను కిరణ్ల పేర్లు ఓ రక్త చరిత్రను తలపిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.