రెచ్చిపోయిన పేర్ని కిట్టు గ్యాంగ్ - జనసేన కార్యకర్త కుటుంబంపై పైశాచిక దాడి (ETV BHARAT) PERNI KITTU FOLLOWERS ATTACK: మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు, ఆయన అనుచరులు దుశ్శాసన పర్వాన్ని మరిపించేలా అరాచకాన్ని సృష్టించారు. ఓ కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడి బీభత్సం సృష్టించారు. ఏకంగా మహిళపై పిడిగుద్దులు కురిపిస్తూ మెడలో తాళి తెంచేందుకు ప్రయత్నించారు. పిల్లలనూ భయభ్రాంతులకు గురిచేశారు.
సాయం చేయండి మహాప్రభో అంటూ బాధితులు అందుబాటులో ఉన్న పోలీసు నంబర్లకు ప్రయత్నించినా ఖాకీలు స్పందించలేదు. పరుగున పోలీసుస్టేషన్‌కు వెళ్లిన బాధితులను గంజాయి బ్యాచ్ పోలీసుల సాక్షిగా దారుణంగా తిడుతూ మరోసారి దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు అక్కడికి చేరుకునేవరకూ పోలీసులు కనీసం ఫిర్యాదు తీసుకోలేదు.
పెట్రెగిపోయిన పేర్ని కిట్టు అనుచరులు - జనసేన నేత ఇంటిపై దాడి - Perni Kittu Follower Attack
బందరులో వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు పోటీచేస్తున్నారు. గురువారం బందరు 8వ డివిజన్ విశ్వబ్రాహ్మణ కాలనీలో ఆడంబరంగా ప్రచారం నిర్వహించారు. ఇదే కాలనీలో జనసేన కార్యకర్త కర్రి మహేష్ నివాసం ఉంది. స్వర్ణకారుడైన కర్రి మహేష్ గత కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఓ బ్యాంకులో అప్రయిజర్‌గా పనిచేస్తున్నారు. పేర్ని కిట్టు ప్రచారవాహనం మహేష్ నివాసానికి చేరుకోగానే పెద్దఎత్తున బాణసంచా కాల్చగా, నిప్పురవ్వలు ఇంట్లోకి దూసుకెళ్లాయి. దీంతో అక్కడున్న మహిళలు బాణసంచా ఎందుకు కాలుస్తున్నారని ప్రశ్నించారు.
దీంతో రెచ్చిపోయిన పేర్ని కిట్టు అనుచరులు మహేష్ నివాసంపై దాడిచేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. పూలకుండీలు ధ్వంసం చేశారు. మహేష్ భార్య హేమలతపై దాడి చేశారు. అడ్డుకున్న ఆమె అత్తగారు జ్ఞానప్రసూనాంబను నెట్టేయడంతో ఆమె తలకు గాయమైంది. హేమలతపై పైశాచికంగా వ్యవహరించారు. అక్కడే ఉన్న హేమలత కుమారుడు సాయికృష్ణ రామబ్రహ్మం, కుటుంబసభ్యులు గోకుల్, నాగబాబులపై కూడా చేయి చేసుకున్నారు. ఇది జరుగుతున్న సమయంలోనే అక్కడికి మహేష్ చేరుకున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించగా ఆయనపైనా దాడిచేశారు.
బందరు యువనేతకు ప్రైవేటు సైన్యం! - ప్రశ్నించిన వారిపై గంజాయి బ్యాచ్‌తో దాడులు - machilipatnam ysrcp leader kittu
విషయం తెలిసిన వెంటనే మచిలీపట్నం జనసేన అభ్యర్థి, ఎంపీ వల్లభనేని బాలశౌరి, తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. విపక్ష నేతల రాకతో పోలీసుల్లో కదలిక వచ్చి అప్పుడు ఇరువర్గాలతో సంప్రదింపులకు సిద్ధమయ్యారు. పోలీసుస్టేషన్‌లో న్యాయం జరగదంటూ ఒక్కసారిగా తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పక్కనే ఉన్న ఎస్పీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కార్యాలయంలో లేరు. అక్కడే ఉన్న పోలీసు అధికారులతో ఎంపీ బాలశౌరి వాగ్వాదానికి దిగారు. అక్కడి నుంచే ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. 24 గంటల్లో చర్యలు బాధ్యులైన వారిపై తీసుకుంటానని ఎస్పీ హామీ ఇచ్చారు.
పేర్ని కిట్టుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీ బాలశౌరి, తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర తెలిపారు. మహిళ పట్ల అతి జుగుప్సాకరంగా వ్యవహరించారని, దీనిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదుచేసి శిక్షించాలని కొల్లు రవీంద్ర డిమాండు చేశారు. ఇటీవల తాలూకా పోలీసు స్టేషన్ మీదకు వెళ్లి తండ్రీకొడుకులు నానా రాద్ధాంతం చేస్తే ఎస్సైనే వీఆర్‌కు పంపారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. బందరులో విచ్చలవిడిగా గంజాయి సరఫరా అవుతోందని, అందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.
పోలీస్ స్టేషన్ ముందు పేర్ని నాని వీరంగం- ఎస్ఐ తో దురుసు ప్రవర్తన - Perni Nani threatening SI