Maa Association Suspends Movie Actress Hema: బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టైన సినీనటి హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ఈ మేరకు హేమను సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె సభ్యత్వాన్ని కూడా శాశ్వతంగా రద్దు చేయాలని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా హేమ ఉదంతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిపై స్పందించిన మంచు విష్ణు గత నెల 25న ఎక్స్‌లో పోస్టు చేస్తూ హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు.
Manchu Vishnu Reaction on Drug Case: మా అసోసియేషన్ అధ్యక్షుడు హేమపై వచ్చిన ఆరోపణలను ఖండించిన తర్వాత ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మరోసారి ఇవాళ ఆమె విషయంలో మా అసోసియేషన్‌లో చర్చకు దారితీసింది. కార్యవర్గ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అధ్యక్షుడు అందరికీ వాట్సప్ గ్రూప్‌లో సందేశాలు పంపించారు. దీనికి స్పందించిన సభ్యుల్లో ఎక్కువ మంది సస్పెండ్ చేయాలని తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారి నిర్ణయాన్ని ఏకీభవిస్తూ డ్రగ్స్ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు సస్పెండ్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరు రేవ్ పార్టీ కేసు - రెండోసారి నటి హేమకు నోటీసులు - second time notice to actress hema