తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్కీ డ్రా అంటూ లాక్ చేస్తారు - ఆపై అందినకాడికి సొమ్ము కాజేస్తారు - Lucky Dip Gifts Frauds Telangana

Lucky Dip Frauds in Telangana : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశలను ఎరగా వేసి అమాయకుల జేబులను గుల్ల చేస్తున్నారు. సైబర్​ నేరాలపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ మీషో పేరుతో స్క్రాచ్‌ కార్డు, లక్కీ డ్రా అంటూ సైబర్‌ నేరగాళ్లు లక్షలు దోచుకుంటున్నారు.

Cyber Frauds in Telanagana
Cyber Frauds in Telanagana

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 2:09 PM IST

Updated : Feb 6, 2024, 2:22 PM IST

Lucky Dip Frauds in Telangana : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆఫర్ల పేరుతో లింక్‌లు పంపడం, బహుమతి గెలిచారని మాయమాటలు చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ మీషో పేరుతో స్క్రాచ్‌ కార్డు, లక్కీ డ్రా అంటూ (Lucky Dip Gifts Frauds)సైబర్‌ నేరస్థులు లక్షలు కొట్టేస్తున్నారు. లక్కీ డ్రాలో భాగంగా తాము చెప్పినట్లు చేస్తే నగదు, కారు, వివిధ దేశాల్లో టూర్‌లకు ఎంపికవుతారంటూ మోసగిస్తున్నారు. వారిని నమ్మి వాట్సాప్‌లో పంపిన క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసినా డబ్బు పోగొట్టుకున్నట్లేనని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకూ తెలంగాణలో 15 కేసులు నమోదు కాగా ఎక్కువగా హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్నాయి.

Cyber Cases in Hyderabad :తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహిత ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో చీర కొనుగోలు చేసింది. 15 రోజుల తర్వాత ఆమెను సంప్రదించిన సైబర్‌ నేరగాళ్లు (Cyber Crimes) లక్కీ డ్రాలో కారు గెల్చుకున్నట్లు వాట్సాప్‌లో సందేశం పంపారు. నిజమేనని నమ్మిన ఆమె పలు ఛార్జీల కింద రూ.35,000 వారికి పంపించింది. పదేపదే డబ్బులు అడగడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

e-Challan Frauds in Hyderabad : ఈ-చలానా మెసేజ్‌ మీకూ వచ్చిందా.. అయితే బీ కేర్​ఫుల్

ఇదిగో ఇలా మోసగిస్తారు! : మీషో వెబ్‌సైట్‌లో ఉత్పత్తి కొనుగోలు చేసిన వినియోగదారులను మాత్రమే సైబర్‌ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. తమ సంస్థ నిర్వహించిన డ్రాలో మీరు లక్కీ కస్టమర్‌గా ఎంపికయ్యారని, కారు బహుమతి గెలుచుకున్నారని వాట్సాప్‌ లేదా మెయిల్‌ ఐడీకి సందేశం పంపిస్తున్నారు. ఒకవేళ కారు వద్దనుకుంటే దానికి సమానమైన నగదు తీసుకోవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం కొందరి ఇంటి చిరునామాలకు నేరుగా నకిలీ లేఖలు పంపించి నమ్మకం కలిగిస్తున్నారు.

అందులో ఇటీవల కొనుగోలు చేసిన వస్తువుల వివరాలు ఉండటంతో కొందరు అందులోని నంబర్‌ను సంప్రదిస్తున్నారు. వారి దగ్గర నుంచి అడ్వాన్స్‌ రుసుము కింద జీఎస్టీ, కొరియర్‌, ఇతర ఛార్జీల పేరుతో సైబర్ ముఠాలు అందినకాడికి వసూలు చేస్తున్నారు. అనుమానం వచ్చి తిరిగి డబ్బు ఇవ్వాలని కోరితే నగదు జమ చేస్తామని నమ్మించి ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది.

Cyber Crime Cases in Hyderabad : లైక్​ కొడితే రూ.200 అని ఆశచూపి.. రూ.59 లక్షలు దోచేశారు

డేటా కొనుగోళ్లతో :ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు వినియోగదారులు, ఇతర డేటా బాధ్యతను థర్డ్ పార్టీ సంస్థలు నిర్వహిస్తుంటాయి. ఈ సంస్థలు ఒక్కో వినియోగదారునికి డేటాకు వెలకట్టి అడ్డగోలుగా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు. దీంతో సమస్త సమాచారం వారి చేతుల్లోకి వెళ్తోంది. ఈ వివరాలతోనే సైబర్‌ ముఠాలు నేరుగా వినియోగదారులను సంప్రదిస్తున్నాయి.

ఈ-కామర్స్‌ సంస్థలు ఓటీపీలు, స్క్రాచ్‌కార్డులు పంపి బహుమతులు ఇవ్వవని సైబర్ పోలీసులు (Cyber Police in Telangana) చెబుతున్నారు. వ్యక్తిగతంగా ఫోన్‌, సందేశం ద్వారా సంప్రదించవని అంటున్నారు. ఏదైనా లింకు క్లిక్‌ చేయాలని పంపిస్తే నమ్మొద్దని, ముందస్తుగా డబ్బు అడిగితే మోసమని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్లలోనే షాపింగ్‌ చేయాలని, సోషల్ మీడియాలో వచ్చే లింకులు, ఆఫర్లని చూసి మోసపోవద్దని సైబర్ పోలీసులు వివరిస్తున్నారు.

ప్రజల నమ్మకమే సైబర్​ మోసగాళ్లకు పెట్టుబడి - చైనా పరిజ్ఞానంతో జేబులు ఖాళీ

సైబర్ నేరాల్లో తెలుగు యువత - ఇతర రాష్ట్రాల వారితో కలిసి కోట్లు కొల్లగొడుతున్నారు

Last Updated : Feb 6, 2024, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details