తెలంగాణ

telangana

ETV Bharat / state

గమ్యం చేరని 'ప్రేమ ప్రయాణం' - తెల్లారితే పెళ్లితో ఒక్కటవ్వాల్సిన జంట, అంతలోనే? - Lover Died in Road Accident - LOVER DIED IN ROAD ACCIDENT

Lover Died in Road Accident : ఆ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. విహహం చేసుకోవాలని అనుకున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివాహానికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. వాటిని తీసుకుని అమ్మాయి బస్సులో, అబ్బాయి ద్విచక్ర వాహనంపై సొంతూరికి బయల్దేరారు. కానీ ఇంతలోనే ఊహించని రోడ్డు ప్రమాదం వారి జీవితంలో విషాదాన్ని నింపింది. ప్రియుడిని కారు ఢీ కొనడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

RANGAREDDY ROAD ACCIDENT
RANGAREDDY ROAD ACCIDENT

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 10:34 AM IST

Updated : Mar 23, 2024, 10:47 AM IST

Lover Died in Road Accident : వారిద్దరూ ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి నడవాలనుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలిపారు. అందుకు అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోగా, అమ్మాయి తరపు వాళ్లు అంగీకరించలేదు. అయినా ఆ యువకుడు ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. వివాహ సామగ్రి సైతం కొనుగోలు చేశారు. కావాల్సిన వస్తువులన్నీ కొని, ఇక ఇంటికి వెళ్లేందుకు వివాహ సామగ్రితో బస్సులో యువతి, ద్విచక్ర వాహనంపై యువకుడు బయల్దేరారు. కానీ ఇక్కడే ఊహించని విషాదం చోటుచేసుకుంది.

పెళ్లి చేయరేమో అన్న భయంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Road Accident in Rangareddy District : ఎన్నో కలలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్న వారి ఆశలను, రోడ్డు ప్రమాదం చిదిమేసింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో యువకుడు తీవ్రగాయాల పాలయ్యాడు. వెనుకే బస్సులో వచ్చిన యువతి అతనిని గమనించింది. కళ్ల ముందే ప్రియుడు (Boyfriend Died) కొన ఊపిరితో పడి ఉండటం చూసి ఆమె ఒక్కసారిగా షాక్​కు గురైంది. వెంటనే తేరుకుని అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట, చావు డప్పులు మోగాయి. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దెబ్బడగూడలో జరిగింది.

Two suicide in Triangle love ఇది మరో 'బేబీ' కథ..! విధి రాసిన మూడుముక్కలాటలో ఇద్దరు బలి!

ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామానికి చెందిన తూంకుంట శంకర్‌(27) హైదరాబాద్‌కు ఉపాధి కోసం వచ్చి సంతోష్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతను ఓ న్యూస్‌ ఛానల్‌లో పని చేస్తున్నాడు. సదరు యువకుడు​ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరి పెళ్లికి శంకర్‌ తల్లిదండ్రులు ఒప్పుకొన్నారు. అమ్మాయి బంధువులు అంగీకరించకలేదు. దీంతో శంకర్‌ ఈ నెల 20న వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రియురాలితో కలిసి హైదరాబాద్​లో వివాహానికి అవసరమైన అన్ని వస్తువులు కొనుగోలు చేశాడు. వాటితో ఈ నెల 19న నగరం నుంచి ఇద్దరూ శంకర్‌ స్వగ్రామానికి బయల్దేరారు. సామగ్రి ఉండటంతో ఓ బంధువుతో పాటు యువతిని బస్సు ఎక్కించి, శంకర్‌ ద్విచక్ర వాహనంపై పయనమయ్యాడు.

హైదరాబాద్‌- శ్రీశైలం జాతీయ రహదారిపై దెబ్బడగూడ గేటు వద్ద శంకర్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన 15-20 నిమిషాల తర్వాత అదే దారిలో బస్సులో వస్తున్న అతనిని ప్రేమించిన యువతి ద్విచక్ర వాహనం నంబరు గుర్తించి పరుగు తీసింది. 108 వాహనానికి కాల్‌ చేసింది. తీవ్రగాయాలైన అతడిని 108లో హైదరాబాద్​లోని ఆసుపత్రికి తరలించింది. తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిన యువకుడు, చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య - తట్టుకోలేక ప్రియుడి బలవన్మరణం

నల్గొండ జిల్లాలో విషాదం - రైలు కిందపడి యువతీయువకుడి బలవన్మరణం

Last Updated : Mar 23, 2024, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details