Literary Festival In Hyderabad :పుస్తకాలు, రచయితలు, పాఠకులు ఒకే వేదిక దగ్గరకు వచ్చేలా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఆధ్వర్యంలో ప్రదర్శన ప్రారంభమైంది. 14 ఏళ్లుగా ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి, ఈసారి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఐటీ ఉద్యోగులు, సిబ్బందికి హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఐటీ కారిడార్ వేదికను ఎంచుకున్నారు. పుస్తక ప్రేమికులనే కాకుండా కొత్త వాళ్లకు సైతం దీని గురించి తెలియజేపాలని ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న భాషలు, పర్యావరణంలో మార్పులు, శాస్త్ర సాంకేతిక రంగం అనే అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వర్చువల్‌గా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
Hyderabad Literary Festival : హైదరాబాద్ మహానగరంలో ఎన్నో విశ్వ విద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. సైన్స్ జీవితంలో ఒక భాగమైనప్పటికీ సామాన్య మానవుడికి దాని గురించి పెద్దగా అర్థంకాదు. శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన విషయాలను విద్యార్థులు, యువతకు అర్థమయ్యేలా ఇక్కడ చర్చగోష్టిలు ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ మార్పులు వాటివల్ల తలెత్తే సమస్యలు, కాలుష్యం తదితర అంశాలపై పలువురు రచయితల పుస్తకాల ప్రదర్శనతోపాటు వాటిపై చర్చలు నిర్వహిస్తున్నారు.
"మొక్కల్లో విభిన్న ప్రపంచం, తెలియని వింతలు ఉన్నాయి. యువత ఎక్కువగా టెక్నాలజీ అలవాటు పడ్డారు. అలాంటివారికి రైతుల కష్టాలు తెలియాలని బుక్స్ ఉన్నాయి. స్టాప్‌వేర్ ఉద్యోగంలో అలసిపోయినప్పుడు వీకెండ్లో ఉల్లాసంగా గడపడానికి ఈ బుక్స్ బాగా ఉపయోగ పడుతాయి."-ఐటీ ఉద్యోగులు