Lectuler Harrasement on College Students: తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా భావిస్తారు. కానీ కొంతమంది వల్ల గురువు స్థానానికి మాయని మచ్చ వస్తోంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించటంతో విద్యార్థులందరూ కలిసి దాడి చేసి అతనికి బుద్ది చెప్పారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
విద్యార్థినిపై అరాచకాలు, ట్యూషన్ టీచర్‌కు దేహశుద్ధి, రోడ్డుపై ఈడ్చుకుంటూ
Students Attack on Lectuler in RajampetaNarayanadri College: విద్యార్థులు తెలిపిన వివరాలు ప్రకారం అన్నమయ్య జిల్లా రాజంపేటలోని నారాయణాద్రి ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ (Narayanadri Engineering College Lectuler Harrasement) జయప్రకాష్ నారాయణ గత కొంతకాలంగా విద్యార్థులు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంయమనం పాటించారు. కానీ రోజు రోజుకు అతని ఆగడాలు ఎక్కువయ్యాయి. ఈ రోజు కళాశాల లెక్చరర్ మరింత బరితెగించి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం (Bad Behaviour)తో విద్యార్థులు సహనం కోల్పోయారు. కాలేజీలోని తోటి విద్యార్థులతో కలిసి అతనిపై దాడికి దిగారు.
విద్యార్థినిపై స్కూల్ టీచర్ లైంగిక వేధింపులు - టాయిలెట్లోకి వెళ్లి మరీ అసభ్య ప్రవర్తన