AI Awareness Training Program in Hyderabad : మెదడలోని ఆలోచనలను సులభంగా పట్టేయ గల సాంకేతికత కృత్రిమ మేధ సొంతం. సెర్చ్ ఇంజిన్‌లో మనం ఏదైనా పదం టైప్ చేస్తుండగానే, దానికి అనుగుణంగా ఉన్న తర్వాత పదాలన్నీ వరుసగా కింద వస్తుంటాయి. దాంతో మనకు కావాల్సిన పదాలను ఎంపిక చేసుకొని సులభంగా సమాచారం సేకరించుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్ దగ్గరి నుంచి వెబ్‌సైట్‌లు, విద్య, వ్యాపారం, వైద్యం ఇలా అన్ని రంగాలు కృత్రిమ ఏఐపై ఆధారపడి పని చేస్తున్నాయి.
తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే కృత్రిమ మేధకు సంబంధించిన కోర్సులు నేర్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లర్నోరమా టెక్నాలజీ సైతం ఈ ఆశయంతోనే ప్రత్యేక శిబిరం నిర్వహిస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించడం ద్వారా పెరిగి పెద్దయ్యాక దానిపై పూర్తి పట్టు సాధిస్తారనే ఉద్దేశంతో లర్నోరమా టెక్నాలజీస్ ప్రతినిధులు శిక్షణ ఇస్తున్నారు.
"కృతిమ మేధను ఉపయోగించి పిల్లలు వెబ్‌సైట్‌లు డిజైన్ చేశారు. అందులో ఈ కామర్స్ వెబ్‌సైట్‌లు, సర్వీస్ వెబ్‌సైట్‌లు రూపొందించారు. ఈ కామర్స్ చేసిన వారికి యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూనర్ అవార్డులకు దరఖాస్తు చేస్తాం." - కార్తీక్ రెడ్డి, లర్నోరమా టెక్నాలజీస్
ప్రతి రంగం కూడా కృత్రిమ మేధపై ఆధారపడి పని చేస్తుండటంతో, దానిపై విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే చైతన్యపర్చేలా శిక్షణ ఇస్తోంది. సర్వీస్ వెబ్‌సైట్, ఈ కామర్స్ వెబ్‌సైట్ రూపొందించడానికి ఎంతో సాంకేతిక పరిజ్ఞానం కావాలి. కానీ ఏఐ ఆధారంగా విద్యార్థులతో సులభంగా వీటిని రూపొందించేలా లర్నోరమా టెక్నాలజీస్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. నెల రోజుల పాటు శిక్షణ తీసుకున్న వారు సొంతంగా వెబ్‌సైట్‌లు రూపొందించారు.