Lavanya About Hero Raj Tarun : సినీ హీరో రాజ్‌తరుణ్ తనను వదిలించుకోవాలని చూస్తున్నారని నటి లావణ్య ఆరోపణలు చేసింది. అతని నుంచి తనకు ప్రాణ భయం ఉందని పేర్కొంది. తనపై కావాలనే డ్రగ్ అడిక్ట్‌లాగా క్రియేట్ చేస్తున్నారని అవేదన వ్యక్తం చేసింది. మస్తాన్‌తో తనకెలాంటి సంబంధాలు లేవని తెలిపింది. తనతో ఇన్ని రోజులు తిరిగి, ఇప్పుడేమో మాల్వీని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని విమర్శించింది. తనకు రాజ్‌తరుణ్ కావాలని, ఆయన లేకపోతే తాను బతకలేనని లావణ్య వాపోయింది.
"రాజ్‌తరుణ్ నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. మాల్వి మల్హోత్రాను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. అతనితో నాకు ప్రాణ భయం ఉంది. నన్ను కావాలనే డ్రగ్ అడిక్ట్‌లాగా క్రియేట్ చేస్తున్నాడు. మస్తాన్‌తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నన్ను వదిలించుకోవడానికి ఆరోపణలు చేస్తున్నాడు. 11 సంవత్సరాలుగా కలిసి సహజీవనం చేస్తున్నాం. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. మల్హోత్రా తమ్ముడు నన్ను బెదిరించాడు. దానికి సంబంధించిన సాక్షాలు కూడా ఉన్నాయి." -లావణ్య, నటి
ఆధారాలు చూపించండి : తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటుడు రాజ్‌తరుణ్, మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే నార్సింగి పోలీసులు శుక్రవారం ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని పేర్కొంటూ 91 సీఆర్‌పీసీ కింద నోటీసు జారీ చేశారు.
Hero Raj Tarun Lover Lavanya Issue : లావణ్య ఫిర్యాదులోని వివరాల ప్రకారం, కోకాపేటలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఆమె 11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఇటీవల కొత్తగా సినీ రంగానికి వచ్చిన ఓ నటితో రాజ్‌తరుణ్ సంబంధం ఏర్పరచుకొని తనను దూరంగా ఉంచినట్లు ఆమె వివరించారు. త్వరలో తాము పెళ్లి కూడా చేసుకోబోతున్నామని పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు.
సహజీవనం చేశాం - బెదిరింపులు అవాస్తవం :తనపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సినీనటుడు రాజ్‌తరుణ్ మీడియాతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన ఆమె హైదరాబాద్ వచ్చినపుడు దగ్గరైందని, తామిద్దరం సహజీవనం చేసిన మాట నిజమేనని తెలిపారు. కానీ గతంలో లావణ్య డ్రగ్స్‌తో పట్టుబడి అరెస్టైందని, ఆమెను కేసులో ఇరికించినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. తామిద్దరం పెళ్లి చేసుకున్నామన్న మాటలు అవాస్తవమేనని అన్నారు. తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రాజ్‌తరుణ్ స్పష్టం చేశారు.
రాజ్‌తరుణ్ లావణ్య వ్యవహారంలో నాకేంటి సంబంధం : నటి మాల్వీ మల్హోత్రా - Actress Malvi Malhotra Reacts
'రాజ్‌తరుణ్ నన్ను ప్రేమించి మోసం చేశాడు' - పోలీసులకు ప్రేయసి ఫిర్యాదు - Case on Hero Raj Tharun